Sensex cracks 840 pts, Nifty below 11,000 mark మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

A day after budget sensex loses 840 points nifty almost 300

Sensex, nifty, LTCG, sensex today, fiscal deficit, budget, BSE, NSE, tax on capital gains, Budget 2018, Securities Transaction Tax, Budget speech, Kotak Mahindra Bank, ICICI bank

The markets saw sharpest fall since August 2017 as it gave a cold shoulder to Budget 2018 with benchmark indices plummeting.

మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Posted: 02/02/2018 05:51 PM IST
A day after budget sensex loses 840 points nifty almost 300

కేంద్ర వార్షిక బడ్జెట్ లో మదుపర్ల దీర్షకాలిక మూలధనంపై పది శాతం పన్ను విధించే కొత్త నిబంధనను అమలుపర్చడంపై మదుపర్లలో అసంతృప్తి నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ. లక్ష మించితే 10శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో ప్రకటించడంతో ఈ నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీసింది.

ఇవాళ మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతుండటంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 11వేల మైలురాయి కిందకు పడిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు కూడా బలహీనంగా ఉండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసింది. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.

దీంతో ముగింపు సమయానికి సెన్సెక్స్ ఏకంగా 840 పాయింట్లు కోల్పోయి 35,066 వద్దకు దిగజారింది. ఇక అటు నిఫ్టీ కూడా 256 పాయింట్ల నష్టంతో 10,760 కి పడిపోయింది. దీంతో టాటాపవర్‌, ఎస్‌బీఐ, మారుతి సుజుకీ, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి. కాగా, టెక్ మహింద్రా, హెచ్ సి ఎల్ టెక్, టీసీఎస్, హెచ్ యు ఎల్, ఐటీసీ సంస్థల షేర్లు లాభాలను అర్జించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sensex  nifty  LTCG  tax on capital gains  fiscal deficit  budget  BSE  NSE  

Other Articles