ఇంధన ధరలు గత కొన్నాళ్లుగా పైపైకి ఎగబాకుతున్నాయి. ఇదిగో తగ్గింది.. అదిగో తగ్గిందని అశగా ఎదురుచూస్తున్న వాహనదారులకు రోజు రోజు పెరుగుతున్న ధరలు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా ఇవాళ పెట్రోల్ ధర రూ.80 దాటింది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేర అత్యధిక స్థాయిలను ఇంధనం నమోదు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పెట్రోల్ ధర ఏకంగా మూడేళ్ల కిందటి గరిష్ట స్థాయికి చేరకుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.72.38గా రికార్డైందని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల రోజువారీ జాబితాలో వెల్లడవ్వగా, ఇక డీజిల్ ధర లీటరుకు రికార్డు స్థాయిలో రూ.63.20ను తాకింది. ఇది 2014 మార్చి నాటి గరిష్ట స్థాయి.
అదే ముంబైలో ఈ రేట్లు మరింత అధికంగా నమోదయ్యాయి. లీటరు పెట్రోల్ ధర రూ. 80 మార్కుకు పైనే కోనసాగుతుంది. ఇక డీజిల్ రూ.67.30 వద్దకు చేరుకుంది. ముంబైలో వ్యాట్ రేట్లు అధికంగా ఉండటంతో, పెట్రోల్, డీజిల్ ధరలు అక్కడ మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. డిసెంబర్ మధ్య నుంచి డీజిల్ ధరలు లీటరుకు రూ.4.86 జంప్ చేసినట్టు ఆయిల్ కంపెనీల డేటాలో వెల్లడైంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు రెక్కలు రావడంతో, దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని ఇంధన మంత్రిత్వశాఖ పేర్కొనింది.
ఈ క్రమంలో ఎక్సైజ్ డ్యూటీని కోత పెట్టాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతుంది. ప్రీ-బడ్జెట్ కు ముందు సమర్పించిన మెమోరాండంలో ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లిఖితపూర్వకంగా సమర్పించింది ఇంధన మంత్రిత్వశాఖ. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో లీటరు పెట్రోల్ పై రూ.19.48 ఎక్సైజ్ డ్యూటీ ఉండగా.. డీజిల్ పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఈ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించి, సాధారణ ప్రజలకు కొంత మేర అయినా ఉపశమనం కల్పించాలని అధికారులు తెలిపారు. కాగా ఇంధన ధరలు తగ్గుముఖంలో తొమ్మిది పర్యాయాలు ఎక్సైజ్ డ్యూటీని విధించిన కేంద్రం.. ఒక్కసారి మాత్రమే డ్యూటీని రూ.2మేర కొత విధించింది.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more