Samsung Galaxy On7 Prime Launched In India సామ్ సంగ్ నుంచి గెలాక్సీ అన్ 7 ప్రైమ్ లాంచ్..

Samsung galaxy on7 prime with samsung mall launched in india

galaxy on7 prime, samsung, galaxy on7 prime price in india, samsung galaxy on7 prime amazon, galaxy on7 prime amazon india, galaxy on7 prime specifications, technology news, mobiles, smartphones

Samsung Galaxy On7 Prime's price in India is Rs 12,990 for the 3GB RAM + 32GB storage, while the 4GB RAM+64GB storage model will cost Rs 14,990.

సామ్ సంగ్ నుంచి గెలాక్సీ అన్ 7 ప్రైమ్ లాంచ్.. ధరెంతో తెలుసా.?

Posted: 01/17/2018 04:33 PM IST
Samsung galaxy on7 prime with samsung mall launched in india

సామాన్యులకు కూడా అందుబాటు ధరలో వుండేలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను సామ్ సంగ్ ఇవాళ దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ పేరుతో కొత్త ఉత్సాదతను తీసుకువచ్చిన సామ్ సంగ్ ఇవాళ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. రెండు స్టోరేజీ వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ ను సామ్ సంగ్‌ తీసుకువచ్చింది. అమెజాన్‌.ఇన్‌, సామ్ సంగ్‌ షాప్‌ రెండింట్లో ఇది లభ్యమవుతుందని పేర్కొంది.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ సేల్ సందర్భంగా ఈ డివైజ్‌ తొలి సేల్ ను శాంసంగ్‌ నిర్వహించబోతుంది. మేకిన్ ఇండియా ఫీచరైన సామ్ సంగ్‌ మాల్ తో వచ్చిన తొలి శాంసంగ్‌ డివైజ్‌ ఈ స్మార్ట్ ఫోనే కావడం విశేషం. గ్రాఫైట్‌ బ్లాక్‌, షాంపైన్‌ గోల్డ్‌ రంగుల్లో ఇది వినియోగదారులకు లభ్యమవనుంది.
 
గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ స్పెషిఫికేషన్లు

* 5.5 అంగుళాల స్క్రీన్‌
* 2.5డీ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
* 8 ఎంఎం ఫుల్‌ మెటల్‌ యునిబాడీ డిజైన్‌
* 13 ఎంపీతో ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరా
* 1.6 గిగాహెడ్జ్‌ ఎక్సీనోస్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
* 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌( ధర రూ.14,990)
* 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌( ధర రూ.12,990)
* 256జీబీ వరకు విస్తరణ మెమరీ

ఈ ఫోన్ పై రిలయన్ష్ జియో కూడా ఎక్స్ క్లూజివ్ గా రెండు వేల రూపాయల క్యాష్ బ్యాక్ లభించనుంది. రూ.299తో 24 నెలల పాటు రీఛార్జ్ చేయించుకున్న అనంతరం జియోమనీ అకౌంట్లో ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవనుంది. తొలి 12 నెలల తర్వాత రూ.800, తర్వాత 12 నెలలకి మరో రూ.1200ను క్రెడిట్‌ చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : galaxy on7 prime  samsung  amazon  on7 prime specifications  E-commerce  business  technology  

Other Articles

Today on Telugu Wishesh