2100 Cashback On Itel A20 Smartphone అత్యంత చౌకధరలో వోడాఫోన్ స్మార్ట్ ఫోన్

Vodafone takes on jiophone with itel 20 ultra low cost 4g volte

Vodafone, Vodafone itel Mobile, itel Mobile, itel 20, Vodafone Online, Vodafone Recharge, Vodafone Number, Vodafone Scheme, itel mobile, vodafone offers, itel a 20, e-commerce, smart phones, mobile, business

Vodafone India and itel Mobile, announced a strategic partnership to provide cashback offer on the purchase of feature intensive itel A20 smartphone.

రిలయన్స్ జియోకు ధీటుగా వోడాఫోన్ ఐటెల్ స్మార్ట్ ఫోన్

Posted: 12/19/2017 07:06 PM IST
Vodafone takes on jiophone with itel 20 ultra low cost 4g volte

రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఫీచర్ ఫోన్ కు పోటీగా ఇప్పటికే ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ సహా మరెన్నో టెలికాం సంస్థలు ఇప్పటికే స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వొడాఫోన్ కూడా ఈ పోటీలో చేరిపోయింది‌, ఐటెల్ భాగస్వామ్యంలో కొత్తగా ఓ 4జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్‌ చేసింది. ఏ20 పేరుతో  ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రూ.3,690 డౌన్‌పేమెంట్‌లో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.2100 క్యాష్ బ్యాక్ ను వొడాఫోన్ ఆఫర్ చేస్తోంది.

అంటే కేవలం రూ.1,590కే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు 4జీ కనెక్టివిటీని కూడా పొందవచ్చు. అయితే క్యాష్ బ్యాక్ ను పొందడానికి ఏ20 స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు వరుసగా 18 నెలల పాటు రూ.150 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా రీఛార్జ్‌లు చేయించుకుంటే, ఏడాదిన్నర తర్వాత రూ.900, ఆ తర్వాత ఏడాదిన్నరకు రూ.1200ను క్యాష్ బ్యాక్ గా అందిస్తుంది. యూజర్లు ఈ క్యాష్ బ్యాక్  మొత్తాన్ని ఎం-పైసా వాలెట్లలో పొందుతారని వొడాఫోన్ పేర్కొంది.

వొడ ఫోన్ -ఇంటెల్ ఏ20 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు...

4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ మెమరీ
1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : itel mobile  vodafone offers  itel a 20  e-commerce  smart phones  mobile  business  

Other Articles