Micromax, Vodafone to offer 4G smartphone at Rs. 999 రూ.999లకే మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్ ఫోన్.. కండీషన్స్ అప్లై..

Micromax vodafone launch bharat 2 ultra 4g smartphone at effective price of rs 999

micromax, bharat 2, micromax bharat 2 ultra, bharat 2 ultra, micromax bharat 2, vodafone, micromax vodafone phone, cheap 4g smartphone, micromax voda 4g smartphone, micromax vodafone 4g smartphone, bharat 2 ultra price in india, bharat 2 ultra features, bharat 2 ultra specifications, micromax bharat 2 ultra price, 4g smartphone, reliance jiophone, low end smartphone, 4g smartphone, mobiles, technology

Micromax Bharat 2 Ultra smartphone users will have do Vodafone recharge of at least Rs 150 per month for 36 months, after which they'll be eligible to get Rs 1,900 cash back.

రూ.999లకే మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్ ఫోన్.. కండీషన్స్ అప్లై..

Posted: 10/24/2017 08:39 PM IST
Micromax vodafone launch bharat 2 ultra 4g smartphone at effective price of rs 999

దేశవాళీ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్, రూ. 999కే స్మార్ట్ ఫోన్ లభించేలా ఓ సరికొత్త స్కీమ్ ను ప్రకటించింది. తాము విడుదల చేసిన 'భారత్ 2 అల్ట్రా' ఫోన్ ధర రూ. 2,899 కాగా, దీన్ని వాడి రూ. 1,900 రీఫండ్ పొందవచ్చని పేర్కొంది. ఇందుకోసం కస్టమర్లు వోడాఫోన్ సిమ్ ను వాడాల్సి వుంటుందని తెలిపింది. తొలి ఏడాదిన్నర తరువాత రూ. 900, ఆపై మరో ఏడాదిన్నర తరువాత రూ. 1000 క్యాష్ బ్యాక్ అవుతుందని, దీంతో రూ. 2,899కి కొన్న ఫోన్ రూ. 999కే వచ్చినట్టు అవుతుందని తెలిపింది.

ఈ సౌకర్యం పొందడానికి ప్రతినెలా కనీసం రూ. 150తో రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుందని మైక్రోమ్యాక్స్ పేర్కొంది. ఇక భారత్ 2 ఆల్ట్రా ఫీచర్ల విషయానికి వస్తే, 4 జీబీ మెమొరీ, 512 ఎంబీ ర్యామ్, 1.3 జీహెచ్ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్, 4 అంగుళాల టచ్ స్క్రీన్, 2/0.3 ఎంపీ కెమెరాలు, 1,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ తదితర సదుపాయాలున్నాయని వెల్లడించింది. కాగా, లో ఎండ్ లో లభించే స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే, మెరుగైన ఫీచర్లనే ఇది కలిగివుందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : micromax  bharat 2 ultra  vodafone  low end smartphone  4g smartphone  mobiles  technology  

Other Articles