nifty, midcap ends at fresh record high చారిత్రక గరిష్టాన్ని అందుకున్న నిఫ్టీ, మిడ్ క్యాప్

Nifty ends at fresh record high midcap too

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The Nifty hit a fresh record high on Tuesday, supported by positive global cues. Nifty free float midcap index rose to a fresh high of 18,021.10, while the S&P BSE midcap index rose to a fresh record high to 14,723.94

చారిత్రక గరిష్టాన్ని అందుకున్న నిఫ్టీ, మిడ్ క్యాప్

Posted: 04/25/2017 06:14 PM IST
Nifty ends at fresh record high midcap too

ప్రపంచ మార్కెట్ల గమనం సానుకూల దిశగా కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక గరిష్టాలను తాకుతూ మరో మైలు రాయిని అందుకున్నాయి. మునుపెన్నడూ తాకని ఉన్నత శిఖరాలను అందుకుని రికార్డులను నమోదు చేసుకుంటున్నాయి. అల్ టైం హై రికార్డులను నమోదు చేసుకుంటూ మదుపరులలో కొత్త జోష్ ను నింపుతున్నాయి. అరంభం నుంచి రికార్డ్‌ లాభాలతో  మెరుపులతో మురిపిస్తున్న మార్కెట్లు వరుస రికార్డులు స్థాయిలు నమోదుచేశాయి. ముఖ్యంగా మిడ్‌ సెషన్లో ఊపందుకున్న కొనుగోళ్ల కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహించాయి.

ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు పాజిటివ్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఉదయం నుంచి లాభాలబాటలో వున్న మార్కెట్లకు మిడ్‌సెషన్‌ అనంతరం కొనుగోళ్ళ ధోరణి బాగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 88.65 పాయింట్లు ఎగిసి రికార్డు స్థాయిలో 9307 వద్ద ముగిసింది. మార్కెట్‌ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 9,300 ని తాకింది. సెన్సెక్స్‌ 287.40 పాయింట్లు జంప్‌చేసి 29,943 వద్ద క్లోజైంది. మరోవైపు  ఉదయం నుంచి రికార్డ్‌ లెవల్స్  ఉన్న బ్యాంక్‌ నిఫ్టీ తన హవాను మరింత పొడిగించింది. తొలిసారి 22,000 పాయింట్లను అధిగమించింది.

అటు విస్తారమైన మిడ్ క్యాప్ సూచీ కూడా సరికోత్త మైలు రాయిని తాకింది. గతంలో ఎన్నడూ తాకని ఉన్నత శిఖరాలను తాకింది. సెన్సెక్స్ లో మిడ్ క్యాప్ సూచీ 18 వేల 21 వేల పాయింట్లను తాకగా, ఇటు నిఫ్టీలో 14వేల 724 పాయింట్లను అందుకుని కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో సెన్సెక్స్‌ దాదాపు 250పాయింట్లకు పైగా లాభపడగా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా సెక్టార్లు గ్రీన్‌లో  ట్రేడ్‌ అయ్యాయి.  రిలయన్స్‌ , ఎంఎం, ఇండియా బుల్స్‌ షేర్ల లాభాలు బుల్‌ రన్‌ లో ప్రధాన పాత్ర పోషించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles