భారతీయ విఫణీలోకి వన్ ప్లస్ 3టీ.. నేటి నుంచి సేల్స్ షురూ..! OnePlus 3T Midnight Black edition India launched in india

Oneplus 3t midnight black edition india launched today

oneplus 3t, oneplus, oneplus 3t midnight black, oneplus 3t amazon black colour, oneplus 3t midnight black edition, oneplus 3t black colour, oneplus 3t sale, oneplus 3t midnight black sale, mobiles, smartphones, technology, technology news

OnePlus 3T in ‘Midnight Black’ Edition started its sale from today since 2pm on e-commerce Amazon India, including one plus stores in india

భారతీయ విఫణీలోకి వన్ ప్లస్ 3టీ.. నేటి నుంచి సేల్స్ షురూ..!

Posted: 03/31/2017 08:49 PM IST
Oneplus 3t midnight black edition india launched today

చైనాకు చెందిన మొబైల్‌ తయారీదారు వన్‌ ప్లస్‌ తక్కువ ధరలో హైఎండ్‌ ఫోన్లను అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. వన్‌ ప్లస్‌ విడుదల చేసిన వన్‌ ప్లస్‌ 3 ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌తో ఫోన్‌ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా నూతనంగా లాంచ్ చేసిన వన్ ప్లస్ 3టీ మిడ్ నైట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ ను నుంచి భారత విఫణీలోకి అందుబాటులోకి వచ్చింది. కేవలం 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ లోనే అందుబాటులో ఉండే దీని ధర రూ.34,999 లని సంస్థ వర్గాలు తెలిపాయి.

భారతీయ స్మార్ ఫోన్ అభిమానులు ఈ వన్ ప్లస్3టీ ఫోన్లను వన్ ప్లస్ ఇండియా స్టోర్లతో పాటుగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్ ఫీరియన్స్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో వుంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇవాళ బెంగళూరులో మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ఫోన్ ను విక్రయించడం ప్రారంభించిందని తెలిపింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ ఫోన్ అచ్చం వన్ ప్లస్ 3టీ బ్లాక్ కొలెట్టే ఎడిషన్ మాదిరే ఉండనుంది. అయితే ఎన్ని డివైజ్లను విక్రయానికి సిద్దం చేసిందన్న వివరాలతో పాటు ఎంత మేరకు లక్ష్యాన్ని నిర్ధేశించుకుందన్న విషయాలను కంపెనీ ప్రకటించలేదు.
 
యూనిక్ కలర్లకు మారుపేరుగా నిలుస్తున్న వన్ ప్లస్.. ఈ ఫోన్ను ప్రస్తుతం ఓ ప్రత్యేక రంగులో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 128జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ ఫోన్ కు ఒకేలా ఉంటాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821, 6జీబీ ర్యామ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ డ్యాష్ ఛార్జ్ దీని ప్రత్యేకతలు. అంతేకాక వన్ ప్లస్ 3కి స్వల్ప మార్పులతో ఈ ఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వన్ ప్లస్ 3 కంటే వేగవంతమైన ఎస్ఓసీ, స్టోరేజ్ పెంపు, ఫ్రంట్ కెమెరాకు మెరుగులు, పెద్ద బ్యాటరీ వంటివి దీనిలో మార్పులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OnePlus  OnePlus 3T  OnePlus 3T Midnight Black  Amazon India  OnePlus Store  Technology  

Other Articles

Today on Telugu Wishesh