ప్రారంభమైన మారుతి సుజుకి ఇగ్నస్ బుకింగ్స్.. Maruti Suzuki Ignis booking open

Maruti suzuki ignis bookings commence for rs 11000

maruti ignis, maruti suzuki ignis price, maruti suzuki ignis launch, maruti ignis launch date, maruti ignis specs, maruti ignis bookings, automotive news

The country’s largest car maker Maruti Suzuki India has started bookings for its premium hatchback Ignis which is due for launch on January 13.

రూ. 11 వేలతో ప్రారంభమైన మారుతి సుజుకి ఇగ్నస్ బుకింగ్స్..

Posted: 01/03/2017 10:18 PM IST
Maruti suzuki ignis bookings commence for rs 11000

దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇగ్నిస్ మోడల్ బుకింగ్స్ ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. వాహన ప్రియుల కోసం మారుతీ సుజుకి తీసుకువస్తున్న ఇగ్నస్ కారు బుకింగ్లను ప్రారంభిస్తున్నట్టు మారుతీ తెలిపింది. ఈ నెల 13 నుంచి డెలివరీలు ప్రారంభించనున్న ఈ కారును కొనుగోలు చేయాలని భావించే వాహన ప్రియులు కంపెనీ నెక్సా వెబ్సైట్లో రూ.11,000కు ఇగ్నిస్ను బుక్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది భారీ ఎత్తున్న లాంచ్ చేయబోయే మోడళ్లలో ఇగ్నిస్ ఒకటి.

దేశీయంగా నెక్సా లైన్-అప్లో విక్రయిస్తున్న మోడళ్లలో ఇది మూడోది. 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో మొదటిసారి దీన్ని ప్రదర్శించారు. పూర్తిగా కొత్త డిజైన్లో ఈ కారును తీసుకురావడం కంపెనీకి అత్యంత కీలకంగా మారింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇగ్నిస్ 14 వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. గుజరాత్లో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటులో ఈ కారును కంపెనీ తయారుచేసింది. మహింద్రా కేయూవీ 100కి పోటీగా ఇగ్నిస్ మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. అయితే దీని ధర మాత్రం 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని కంపెనీ వర్గాల సమాచారం.

ఇగ్నిస్ మోడల్ ప్రత్యేకతలు...

1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్
1.3 లీటర్ డీజిల్ ఇంజిన్
5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో హెడ్ల్యాంప్స్
నావిగేషన్తో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
ఆపిల్ కార్ప్లే
యూఎస్బీ
ఏయూఎక్స్
భద్రతా పరమైన ఫీచర్లు: యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maruti Suzuki  Ignis Bookings  Commence  automotive  

Other Articles

Today on Telugu Wishesh