భారీ లాభాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు bulls back on dalal street

Sensex zooms 406 pts nifty ends above 8000

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The Sensex was up 406.34 points or 1.6 percent at 26213.44 and the Nifty ended up 124.60 points or 1.6 percent at 8032.85. About 1679 shares advanced, 862 shares declined, and 193 shares were unchanged.

భారీ లాభాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Posted: 12/27/2016 06:02 PM IST
Sensex zooms 406 pts nifty ends above 8000

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను అందుకున్నాయి. గత కొన్నాళ్లుగా లాభానష్టాల మధ్య ఉగిసలాడుతూ.. నష్టాలను మూటగట్టుకున్న దేశీయ సూచీలకు ఇవాళ కోంత బలం చేకూరింది. ఉదయం కొంత లాభానష్టాల మధ్య కొట్టుమిట్టాడిన సూచీలు సాయంత్రానికి మంచి లాభాలను అందుకున్నాయి. ఇవాళ్టి లాభాలతో ఏకంగా సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ కూడా కీలకమైన 8 వేల మార్కును అందుకుంది.

ఇవాళ ఉదయం మార్కెట్లు ఆరంభంతోనే లాభాలను అందుకున్నాయి. తొమ్మిది రోజుల కరెక్షన్ అనంతరం ఫార్మా షేర్లు తిరిగి పుంజుకోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. లాభాల్లో ఎగిసిన కొద్దిసేపటికే మార్కెట్లు మళ్లీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. 90 పాయింట్ల లాభంలో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయానికి 9.58 పాయింట్ల లాభంలో 25,816 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 7,908గా ట్రేడ్ సాగించింది.

గత కొన్ని సెషన్లగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న మార్కెట్లు లాంట్ టర్మ్ కాపిటల్ లాభాలపై పన్నులుండవన్న ఆర్థికమంత్రి  అరుణ్ జైట్లీ భరోసాతో బౌన్స్ బ్యాక్  అయ్యాయి. దీంతో పదకొండు గంటల నుంచి మంచి ఊపునందుకున్న స్టాక్ మార్కెట్లు ర్యాలీని కొనసాగించాయి. డిసెంబర్ మాసం డెరివెటివ్స్ గడవు రేపటితో ముగుస్తున్న తరుణంలో ఈ మాసం మార్కెట్లకు ఇది మంచి ఊపునందించిదని కూడా మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లు ముగింపు సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్ల లాభంతో 26 వేల 213 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, ఇటు నిఫ్టీ కూడా 8వేల 33 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ తరుణంలో ఇవాళ మొత్తంగా 1679 సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, 862 సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా 193 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ అటో, బ్యాకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, మెటల్స్, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్యకు సంబంధిచిన సూచీలు భారీ లాభాలను అందుకోగా, మిగిలిన అన్ని సూచీలు కూడా లాభాల బాటలోనే పయనించాయి. ఈ క్రమంలో ఐటీసీ, బాస్చ్, టటా స్టీల్, అరబిందో ఫార్మ, టాటా మోటార్స్ డీజిల్ తదితర సంస్థల షేర్లు అత్యధికంగా లాభాలను అర్జించగా, గెయిల్, గ్రాసిమ్ సంస్థల షేర్లు నష్టాల్లో పయినించాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles