సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కోసం హోండా గూగుల్ ల మధ్య డీల్ కుదరింది.. Google Strikes A Deal With Honda For Self Driving Car Tech

Google strikes a deal with honda for self driving car tech

google, self-driving car project, honda, self driving, waymo, automotive, technology news, business news

Honda, is now in talks with Google for a collaboration that would further develop Google's self-driving car tech and to eventually make available self-driving cars in the market.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కోసం హోండా గూగుల్ ల మధ్య డీల్ కుదరింది..

Posted: 12/24/2016 05:58 PM IST
Google strikes a deal with honda for self driving car tech

ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా నుంచి త్వ‌ర‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రాబోతున్నాయి. 2020  నాటికి డ్రైవ‌ర్ ర‌హిత కార్ల‌ను తీసుకొస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన హోండా ఆ మేర‌కు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇందుకోసం 'వేమో' అనే మ‌రో సంస్థ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించిన హోండా..  గూగుల్ మాతృసంస్థ ఆక‌ఫాబెట్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. 33ఎట్ అభివృద్ధి చేసిన 'వేమో' అనే సెల్ఫ్ డ్రైవింగ్ వ్య‌వ‌స్థ దాదాపు పూర్తికావచ్చింది. ఈ టెక్నాల‌జీతో ఇప్ప‌టికే అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌ను ప‌రీక్షించింది.

ఈ టెక్నాల‌జీకి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని మార్పులు చేసిన‌ త‌ర్వాత పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు అదే సాఫ్ట్‌వేర్‌ను తాము అభివృద్ధి చేయ‌నున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌లో ఉప‌యోగించుకునేలా ఒప్పందం చేసుకోవాల‌ని హోండా భావిస్తోంది. 2020లో టోక్యోలో జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు జ‌పాన్ ప్ర‌ధాని షింజో గ‌తంలోనే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకు అనుగుణంగానే హోండా త‌న ప్ర‌యత్నాల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google  self-driving car project  honda  self driving  waymo  automotive  technology news  business news  

Other Articles