వడ్డీ రేట్ల సవరించిన ఫెడ్.. అయినా మార్కెట్లకు నష్టాలు Nifty, Sensex fall after Fed hints at more rate hikes

Sensex flat after us federal reserve hikes interest rate

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The benchmark Sensex reversed its two-day rally as it fell 156 points on Wednesday to end at 26,237 as RBI left interest rate unchanged at 6.25%, contrary to market expectations

వడ్డీ రేట్ల సవరించిన ఫెడ్.. అయినా మార్కెట్లకు నష్టాలు

Posted: 12/15/2016 06:38 PM IST
Sensex flat after us federal reserve hikes interest rate

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు అక్కడి అర్థిక నిఫుణుల అంచానాల మేరకు 0.25 శాతం పెంచిన తరువాత లాభాల బాటలో పయనిస్తున్న దేశీయ సూచీలు ఒక్కసారిగా నష్టాలలోకి జారుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉండడమే రేటు పెంపు నిర్ణయానికి కారణమని ఫెడ్‌ పేర్కొనగా.. వచ్చే మూడేళ్లూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పుంజుకునే అవకాశం ఉందనీ ఫెడ్‌ అంచనా వేసింది.

ఫెడ్‌ రేటు పెంపు వార్త వెలువడిన వెంటనే అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కడపటి సమాచారం అందే సరికి డౌజోన్స్‌ కొత్త రికార్డు స్థాయికి చేరింది. అయితే అమెరికా ఫెడ్ రిజర్వు ప్రకటన నేపథ్యంలో మదుపరులు డోలాయమానంలో పడ్డారు. అక్కడి సానుకూల సంకేతాల ప్రభావంతో పుంజుకోవాల్సిన మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో అసియా మార్కెట్ల భారీగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోన్నాయి. దీంతో దేశీయ సూచిలు కూడా అదే బాటలో పయనించాయి.

ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు నష్టాల బాటలో పయనించగా, ఆ తరువాత క్రమంగా లాభాలను నమోదు చేసుకున్నాయి. ఫెడ్ రిజర్వు ప్రకటన వెలువడిన నేపథ్యంలో మళ్లీ నష్టాలను మూటగట్టుకున్నాయి. లో దూసుకెళ్లాయి. ఉదయం తొమ్మిదిన్నర సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో వుండగా, అటు నిఫ్టీ కూడా 39 పాయంట్ల లాభంతో ముందుకు సాగుతుంది. పెడ్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించిన ప్రకటన వెలువడగానే మార్కెట్లు తిరోగమనం బాటపట్టాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 84 పాయింట్ల నష్టంతో 26 వేల 519 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 29 పాయింట్ల నష్టంతో 8154 పాయింట్ల వద్దకు చేరుకుని.. కీలకమైన 8150 మార్కుకు ఎగువన ముగిసింది. ఈ క్రమంలో హెల్త్ కేర్ రంగ సూచాలు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. అటో, కన్జూమర్ డ్యూరబుల్్స్, ఎఫ్ఎంజీసీ, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు కూడా నెలచూపులే చూశాయి.

కాగా బ్యాంకింగ్ , బ్యాంక్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మెటల్స్, టెక్నాలజీ, ఐటీ, చిన్న, మధ్య తరహా సూచీలు కూడా స్వల్ప లాభాలను అందుకున్నాయిఈ క్రమంలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్ సీ ఎల్ టెక్, ఎం అండ్ ఎం తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, సన్ ఫార్మ, టాటా మోటార్స్ డీజిల్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles