నాలుగు వారాల కనిష్టస్థాయికి దేశీయ సూచీలు Nifty, Sensex fall after Fed hints at more rate hikes

Sensex nifty break key support levels drift near 1 month low

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Indian shares fell for the seventh straight day, with the benchmark breaking key support levels, as uncertainty over economic growth and corporate profits persisted.

నాలుగు వారాల కనిష్టస్థాయికి దేశీయ సూచీలు

Posted: 12/22/2016 07:30 PM IST
Sensex nifty break key support levels drift near 1 month low

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టాల బాటలోనే పయనించాయి. వరుసగా గత ఏడు రోజుల నుండి తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్న మార్కెట్లు ఏకంగా 718 పాయింట్లను దిగజారాయి. ఒడిదొడుకులకు గురయ్యాయి. ఇవాళ ట్రేడింగ్ లో భాగంగా ఏకంగా మూడు వందల పాయింట్లు కిందకు జారిన మార్కెట్లు ముగింపులో కొద్దిగా మెరుగు పర్చుకున్నప్పటికీ.. నష్టాలు మాత్రం వీడలేదు. ఫలితంగా మార్కెట్లు ఇవాళ నాలుగువారాల కనిష్ట స్థాయిని అందుకున్నాయి,

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దాని ప్రభావం డిసెంబర్ మాసంతో ముగిసే త్రైమాసిక ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుబోతుందోనన్న అందోళన మదుపుదారుల్లో నెలకోందని, ఆ భయాల ఫలితంలోనే మార్కెట్లు వరుసగా గత వారం రోజులుగా నష్టాల బాటను వీడటం లేదని మార్కట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల సమావేశాల ప్రభావంతో పాటు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై జనవరిలో పగ్గాలను అందుకోనున్న డోనాల్డ్ ట్రంప్ ఎకానమీ విధానాలను కూడా జనవరి మాసంలో ప్రకటించనున్న నేపథ్యంలో మదుపుదారుల వేచి చూసే ధోరణని అవలంభిస్తున్నారని మార్కెట్ వర్గాల భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లు ఇవాళ కూడా నేలచూపులే చూశాయి. ఫలితంగా అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీలు కీలకమైన మార్కుల కిందకు దిగజారాయి. ఇవాళ ముగింపు సమయానికి సెన్సెక్స్ 263 పాయింట్ల నష్టంతో 25 వేల 980 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 82 పాయింట్ల నష్టంతో 7979 పాయింట్ల వద్దకు చేరుకుని.. కీలకమైన 8000 మార్కుకు దిగువన ముగిసింది. ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన సూచీలు ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయి. మెటల్స్, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, తదితర సూచీలు భారీగా నష్టాలను అందుకున్నాయి.

కాగా ఎఫ్ఎంజీసీ, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిస్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య, అటో సహా అన్ని రంగాల సూచీలు నెలచూపులనే చూశాయి. ఈ క్రమంలో ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, జీ ఎంటర్ టైన్మెంట్ సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, హిందాల్కో, అదాని పోర్ట్స్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles