తేరుకోని దేశీయ మార్కెట్లు.. 8100 మార్కుకు చేరిన నిఫ్టీ Sensex sinks 514 pts, Midcap down 4% on demonetisation

Sensex sinks 514 pts midcap down 4 on demonetisation

Rs500 Notes, Rs1000 Notes, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

BSE Sensex closed lower by 156.13 points, or 0.57%, to 27,274.15; Nifty 50 of the NSE ended lower by 51.20 points, or 0.60%, to 8433.75

తేరుకోని దేశీయ మార్కెట్లు.. 8100 మార్కుకు చేరిన నిఫ్టీ

Posted: 11/15/2016 08:56 PM IST
Sensex sinks 514 pts midcap down 4 on demonetisation

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభంతోనే కుప్పకూలాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో మార్కెట్లు కుదేలయ్యాయి. నల్లధనం, అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని చెబుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయడం మదుపరులకు రుచించకపోవడంతో దేశీయ సూచీలపై దాని ప్రబావం వడింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి పతనం దిశగా పయనిస్తున్న మార్కెట్లు ఇవాళ కూడా అదే దారిలో పయనించాయి.

ఉదయం ప్రారంభంతోనే మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడింగ్ సాగించగా, అటు నిఫ్టీ కూడా 121 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ సాగించింది. దీంతో ఆరంభంలోనే సెన్సెక్స్ 332 పాయింట్లు కోల్పయి 26 వేల 500 మార్కుకు దిగువకు జారీ ట్రేడింగ్ కొనసాగించింది. నిఫ్టీ కూడా 121 పాయింట్ల నష్టంతో 8200 కీలక మార్కు దిగువకు చేరి ట్రేడింగ్ సాగించింది. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ ఏకంగా 514 పాయింట్లు నష్టపోయి 26 వేల 304 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 188 పాయింట్లకు పైగా నష్టపోయి 8వేల 108 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8100 మార్కుకు ఎగువకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో ఐటీ సూచీలు స్వల్పంగా లాభాలను అందుకోగా మిగిలిని అన్ని సూచీలు నష్టాలలోనే పయనించాయి. ముఖ్యంగా అటో, బ్యాంకింగ్, మెటల్స్, బ్యాంకింగ్ నిఫ్టీ, చిన్నతరహా, మధ్య తరహా, మధ్య తరహా సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ సహా మిగిలిన అన్ని రంగాల సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ రంగాల సూచీలు నెలచూపులు చూశాయి. ఈ క్రమంలో బ్యాంక్ అఫ్ బరోడా, ఐడియా సెల్యూలార్, ఎస్ బీఐ, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, హెచ్ యూఎల్ తదితర సంస్థల సూచీలు అధిక లాభాలను ఆర్జించగా, టాటా మోటార్స్, టాటా మోటార్స్ (డీజిల్), గ్రాసిమ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్ డీఎఫ్ సీ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles