భారీ లాభాల్లో మార్కెట్లు.. 8750 పాయింట్ల దిగువన నిఫ్టీ Nifty ends below 8750, Sensex up 377 pts ahead of RBI policy

Nifty ends below 8750 sensex up 377 pts ahead of rbi policy

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Maruti, Hero MotoCorp, Adani Ports, Asian Paints and L&T are top gainers while TCS was only loser stock in the Sensex.

లాభాలను పండించిన మార్కెట్లు.. 8750 పాయింట్ల దిగువన నిఫ్టీ

Posted: 10/03/2016 06:15 PM IST
Nifty ends below 8750 sensex up 377 pts ahead of rbi policy

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను అర్జించాయి. భారతీయ రిజర్వు భ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షను మంగళవారం సమీక్షించనున్న నేపథ్యం వడ్డీ రేట్లు తగ్గుతాయన్న సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. దీనికి తోడు రియల్టీ, ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్, మీడియా  షేర్ల  ర్యాలీతో సోమవారం నాటి మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. వీటికి తోడు విదేశీ మార్కెట్లు నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మరీ ముఖ్యంగా ఐరోపా, అసియా మార్కెట్ల నుంచి వచ్చిన పవనాలు కూడా మార్కెట్లను లాభాలపంట పండించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు బారీ లాభాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 28,250 మార్కుకు చేరవలో ముగియగా, అటు నిఫ్టీ కూడా కీలకమైన 8,750 మార్కు వద్ద ముగిసాయి.

ఉదయం ప్రారంభం నుంచే మార్కట్లు లాభాలలో దూసుకెళ్లాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా ఎగబాకగా, ఆ తరువాత మధ్యహ్నానికి క్రమంగా 242 పాయింట్ల లాభంలోకి వెళ్లింది.. అక్కడి నుంచి లాభాలను అధిమిపట్టుకోవడంతో పాటు మరిన్ని లాభాలను కూడా సోంతం చేసుకున్నాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి 377  పాయింట్ల లాభంతో 28,243 దగ్గర,  నిఫ్టీ127 పాయింట్ల లాభంతో  8,738 వద్ద స్థిరంగా ముగిసాయి. ఆర్బీఐ పాలసీ సమీక్షలో వడ్డీరేట్ల కోత  అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ బాగా బలపడింది. దీంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

మంచి జోరుమీదున్న మార్కెట్లో అన్ని సూచీలు లాభాల బాటలోనే పయనించాయి, ఏ ఒక్క సూచీ కూడా నష్టాల పాలు కాలేదు. మరీ ముఖ్యంగా అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్,  మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్యలు భారీ లాభాలను అర్జించగాయి, కాగా ఐటీ టెన్నాలజీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మిగిలిని సూచీలు కూడా లాభాలను అందుకున్నాయి, ఈ క్రమంలో జీ ఎంటర్టైన్మెంట్, ఏషియర్ మోటార్స్, మారుతి సుజుకీ, హీరో మోటా కార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ సూచీలు భారీ లాభాలను అర్జించగా, టీసీఎస్, భారతి ఇన్ట్రాటెల్, బాస్చ్ సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles