దేశీయ విఫణీలో పరుగులు పెడుతున్న మారుతీ విక్రయాలు Maruti Suzuki sales jump 29% in September

Maruti suzuki sales jump 29 in september

maruti suzuki, maruti suzuki cars, maruti suzuki profit, maruti growth, maruti suzuki cars, maruti suzuki sales, indian market, car news, automobile news, business news

The country’s largest carmaker Maruti Suzuki India on Saturday reported a 31.1 per cent growth in its passenger vehicle sales in September at 1,49,143 units, riding on its highest-ever domestic sales.

దేశీయ విఫణీలో పరుగులు పెడుతున్న మారుతీ విక్రయాలు

Posted: 10/01/2016 05:26 PM IST
Maruti suzuki sales jump 29 in september

దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాల్లో దూసుకెళ్లింది. సెప్టెంబర్ నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాల్లో 31.1 శాతం వృద్ధిని నమోదుచేసి, 1,49,143 యూనిట్లగా రికార్డు చేసింది. వీటిలో అత్యధికంగా దేశీయ అమ్మకాలు ఉండటం విశేషం. గతేడాది ఇదే నెలలో మారుతీ సుజుకీ ఇండియా కేవలం 1,13,759 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దేశీయ అమ్మకాలు గతేడాది 1,06,083 యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో 1,37,321 యూనిట్లుగా నమోదయ్యాయి. జూలై అమ్మకాలను సైతం మారుతీ సుజుకీ అధిగమించింది.
 
గత కొన్ని నెలలుగా అమ్మకాల ఒత్తిడిలో ఉన్న మిని సెగ్మెంట్ కార్లు వాగన్ ఆర్, ఆల్టో మోడల్స్ సైతం అమ్మకాల్లో దూసుకెళ్లాయి. ఈ వాహనాలు 24.8 శాతం జంప్ అయి, 44,395 యూనిట్లుగా నమోదుచేశాయి. కాంపాక్ట్ సెగ్మెట్ కార్లు స్విఫ్ట్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్లు కూడా 12.3 శాతం ఎగిసి, 50,324 యూనిట్లను అమ్మినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ కార్లు గతేడాది కంటే అత్యధికంగా 52.5 శాతం పెరిగి 6,544 యూనిట్లుగా రికార్డుచేసినట్టు తెలిపింది. వాణిజ్య వాహనాలు, ఎగుమతులు కూడా సెప్టెంబర్ నెలలో ఎగిసినట్టు వెల్లడించింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maruti Suzuki  sales  September  indian market  latest cars  automobile news  

Other Articles