నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేకులు.. నష్టాల్లో మార్కెట్లు.. Sensex closes lower after four sessions of gains

Sensex closes lower after four sessions of gains

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Shares ended lower on Tuesday, snapping a four-day rally, as sentiment stayed cautious ahead of policy meetings by the Federal Reserve and the Bank of Japan later this week.

నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేకులు.. నష్టాల్లో మార్కెట్లు..

Posted: 09/20/2016 07:22 PM IST
Sensex closes lower after four sessions of gains

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ తీవ్ర అటుపోట్లను ఎదుర్కోన్నాయి. దేశీయ మార్కెట్లు  నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నుంచి వచ్చిన ప్రతికూల ప్రభావంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను సమీక్షిస్తుందని, వడ్డీ రేట్లు పెరగవచ్చని అంచనాల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయాయి, దీనికి తోడు జపాన్ బ్యాంకు కూడా ఈ వారాంతంలో వడ్డీ రేట్లను సమీక్షిస్తున్నాయని వార్తలు కూడా మార్కెట్లను తిరోగమనం వైపు నడిపించాయి,

గత నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ చెప్పిన సెన్సెక్స్ 111  నష్టంతో, నిఫ్టీ 33 నష్టంతో ముగిశాయి. 8800  మద్దతు స్థాయి కిందికి దిగజారిన నిఫ్టీ8775 వద్ద ముగిసింది. ప్రధానంగా రియల్టీ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. డీఎల్ ఎఫ్, ఇండియా బుల్స్ , హెచ్ డీఎల్ సూచీలు  పతన మయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో కొనుగోళ్ల  ఒత్తిడి నెలకొంది. ఒన్ జీసీ, కాస్ర్టోల్ ఇండియా లాభపడ్డాయి.

భారతి ఇన్ ఫ్రా టెల్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఎస్ బ్యాంక్, టాటా స్టీల్, హిందాల్కో, సిప్లా,మారుతి సుజుకి ఐసీఐసీఐ బ్యాంక్  షేర్లు లాభాలను ఆర్జించగా, భారతి ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్ టాప్  లూజర్స్ గా నిలిచాయి. అటు  డాలర్ తోపోలిస్తే రూపాయి విలువ మరింత బలహీన పడింది. 0.05 పైసల నష్టంతో 67.02 దగ్గరుంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో  పదిగ్రాముల పసిడి ధర 57 రూపాయల లాభంతో 30,960  వద్ద ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles