Long queues, SIM cards scarcity on Day 1 of Jio launch

Reliance jio 4g service is now live nation wide

reliance, reliance jio 4g, jio 4g, jio mnp, jio mobile number portability, reliance jio 4g, reliance jio 4g sim, jio 4g sim, mobile number portability, mnp, get jio on same number, jio data plans, jio tariffs, technology, technology news

Reliance Jio 4G services launch fully today and here's how you can port your mobile number to the network.

దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి..

Posted: 09/06/2016 09:27 AM IST
Reliance jio 4g service is now live nation wide

కనివినీ ఎరుగని రీతిలో స్మార్ట్ ఫోన్ ప్రియులకు అద్భుతమై ఆఫర్లను ప్రకటించి.. కస్టమర్లను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 4జీ సదుపాయం ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా జియో సిమ్‌ను ఉపయోగించుకునే అవకాశం యూజర్లకు కల్పిస్తోంది. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్‌లను తాజాగా ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ కంపెనీ ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత వేగంగా 10 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కూడా ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం జియో సిమ్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లోనే లభ్యమవుతుండగా.. నేటి నుంచి మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్లు, మొబైల్ ఫోన్ షాప్‌లలోనూ తీసుకోవచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం.

ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఆతర్వాత 4జీ డేటా రూ.149 నుంచి రూ.4,999 వరకూ 10 రకాల ప్లాన్‌లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్‌ఎంఎస్, ఏడాది పాటు యాప్స్ సబ్‌స్క్రిప్షన్ వంటివి జియో ఆఫర్ చేస్తోంది. ఇదిలావుండగా, రిలయన్స్ సిమ్ కార్డులు అందుబాటులో లేక అనేక మంది కస్టమర్లు కౌంటర్ల నుంచి ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇక మరికోన్ని చోట్ల సిమ్ కార్డుల కోసం పండగ పర్వదినాన కూడా పెద్ద క్యూలు లలో గంటల తరబడి వేచి వుండటం కూడా కస్లమర్లను ఇబ్బందిపర్చింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RIL  Reliance Jio 4G services  sim cards scarcity  technology  

Other Articles