Sensex, Nifty hit over 1-year high; log 6th straight monthly gain

Sensex climbs 109 16 points to end at 28452 17

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Market rally continued for the third straight session, with Sensex surging over 109 points to end at a fresh 13-month high of 28,452.17.

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఏడాది గరిష్టస్థాయికి సెన్సెక్స్,.

Posted: 08/31/2016 06:20 PM IST
Sensex climbs 109 16 points to end at 28452 17

దేశీయ స్టాక్ మార్కెట్లు క్రితం రోజున అందుకున్న భారీ లాభాలతో పాటు దాని ప్రభావంతో ఇవాళ కూడా మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. నెలవారిగా గణిస్తే వరుసగా అరో మాసం కూడా దేశీయ సూచీలు లాభాలను నమోదు చుసుకున్నాయి. దీంతో సెస్సెక్స్ 13 నెలల గరిష్టస్థాయికి చేరింది. నిన్నటి భారీ లాభాలను తరువాత నిఫుణుల అంచనాలను తలకిందులు చేస్తూ మార్కెట్లు లాభాలలో దూసుకెళ్లాయి. బ్యాంకు, ఆటో స్టాక్స్ మద్దతుతో ఉదయం మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైన ఆ తరువాత గంట వ్యవధిలోనే పుంజుకుని లాభాలను అందుకున్నాయి.  

ఉదయం 11 గంటలకు 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, 84.53 పాయింట్ల లాభంతో 28444దగ్గర, నిఫ్టీ 34.50 పాయింట్ల లాభంతో 8,786 వద్ద కొనసాగగా, అప్పటి నుంచి అదే జోరును స్థిరంగా కొనసాగిస్తూ మార్కట్ ముగింపు సమయానికి 109 పాయింట్ల లాభంతో 28 వేల 452 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 42 పాయింట్ల లాభంతో 8786 పాయింట్ల లాభం వద్ద ముగిసింది.

అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డూరబుల్స్, అటో సూచీలు లాభాలను అర్జించాయి, వీటితో పాటు ఎఫ్ఎంజీసీ, చిన్న తరహా, మధ్య తరహా పారిశ్రామిక సూచీలు స్వల్ప లాభాలను నమోదు చుసుకున్నాయి, కాగా హెల్త్ కేర్, ఐటి, బీఎస్సీ మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి, అల్ట్రా టెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా, లార్సెన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్ టైన్మెంట్ తదితర సూచీలు లాభాలను అర్జించగా, బాస్చ్, ఓఎన్జీసీ, హిండాల్కో, టాటా స్టీల్, లుపిన్ తదితర సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles