DataWind launches smartphone at Rs 1499 with one year free Internet

Datawind pocket surfer gz smartphone launched at rs 1499

datawind, datawind phone, datawind pocketsurfer gz, pocketsurfer gz phone, pocketsurfer gz free internet phone, cheapest smartphone, budget android smartphone, datawind smartphones, technology, technology news

DataWind, which is known for its low-budget tablets in India, has launched a new smartphone at a price of only Rs 1,499.

ఏడాది ఫ్రీ ఇంటర్ నెట్ తో.. డాటావిండ్ నుంచి చౌకధర స్మార్ట్ ఫోన్..

Posted: 08/13/2016 03:04 PM IST
Datawind pocket surfer gz smartphone launched at rs 1499

తక్కువ బడ్జెట్లో భారతావని కస్టమర్లకు టాబ్లెట్లను ఆందించిన కంపెనీగా పేరున్న డేటావిండ్, తాజాగా తన కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. పాకెట్సర్ఫర్ జీజడ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ను రూ.1,499కే కస్టమర్లకు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్తో పాటు ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సౌకర్యాన్ని కూడా వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. స్మార్ట్ఫోన్ ధరలను తగ్గిస్తూ.. టెక్నాలజీని సరసమైన ధరల్లో యూనివర్స్ల్గా అందించేందుకు దృష్టిసారించామని డేటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి చెప్పారు. టెక్నాలజీ డెమోక్రటైజేషన్కు ఇదే నిజమైన అర్థమని తెలిపారు.

తక్కువ ధరల్లో టెక్నాలజీని అందించడం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని సునీత్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలో దాగిఉన్న ప్రతి మూలకు టెక్నాలజీ చేరేలా తాము దోహదం చేస్తామన్నారు. టచ్ స్క్రీన్, రియర్ కెమెరా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఈ ఫోన్ కలిగి ఉంది. అయితే పాకెట్సర్ఫర్ జీజడ్కు సంబంధించిన మిగతా ఫీచర్లను కంపెనీ తెలుపలేదు. తాజాగా లాంచ్ చేసిన పాకెట్సర్ఫర్ జీజడ్ ఒక్కటే కంపెనీ నుంచి వెలువడిన బడ్జెట్ స్మార్ట్ఫోన్ కాదు.

పాకెట్సర్ఫర్ 2జీ4ఎక్స్, పాకెట్సర్ఫర్ 3జీ4ఎక్స్, పాకెట్సర్ఫర్ 3జీ5, పాకెట్సర్ఫర్ 3జీ4జడ్ స్మార్ట్ఫోన్లను కూడా కంపెనీ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో బడ్జెట్ ధరల్లో మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఫ్రీడం 251 తర్వాత డేటావిండ్స్ పాకెట్సర్ఫర్ జీజడ్ స్మార్ట్ఫోనే చాలా చౌకైన మొబైల్. ఐడీసీ డేటా ప్రకారం డేటావిండ్ తక్కువ ధరల్లో టాబ్లెట్లను అందించడంలో మార్కెట్ లీడర్గా ఉంది. కంపెనీ టాబ్లెట్ల రవాణా 2016 తొలి త్రైమాసికంలో 33.5 శాతం పెరిగి, 27.6 శాతం మార్కెట్ షేరును డేటావిండ్ దక్కించుకుంది. మొత్తంగా టాబ్లెట్ మార్కెట్ భారత్లో ఫ్లాట్గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DataWind  low-budget smartphone  smartphone at Rs 1  499.  Technology  mobile phone news  

Other Articles