Honda Amaze Sales Cross 2 Lakh Units in Three Years of Launch

Honda amaze crosses the 2 lakh sales milestone

honda amaze, honda amaze booking, honda amaze sale, Honda, Honda Amaze, compact sedan, 2 lakh sales, three years, launch, indian market, honda amaze news

Honda Cars India has achieved a new milestone with its Amaze sub-compact sedan that has crossed the sales milestone of 2,00,000 units in the country.

అదరగోడుతున్న హోండా అమేజ్ విక్రయాలు..

Posted: 06/15/2016 06:49 PM IST
Honda amaze crosses the 2 lakh sales milestone

కాంపాక్ట్ సెడాన్ లోకి దూసుకొచ్చిన హోండా అమేజ్ కారు అమ్మకాల్లో అదరహో అనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో 2 లక్షల అమ్మకాల మైలురాయిని హోండా అమేజ్ చేధించింది. 2013 ఏప్రిల్ లో ఈ కారును భారత మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ కారుతో భారత డీజిల్ విభాగంలోకి హోండా ప్రవేశించింది. మూడేళ్ల వ్యవధిలో ఈ కారు 2లక్షల యూనిట్ల అమ్మకాలతో మైలురాయిని తాకాయని, కొత్త కస్టమర్లను ఎక్కువగా ఈ కారు ఆకట్టుకుంటోందని హోండా కార్ల ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్, సేల్స్ అధినేత జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. చిన్న, పెద్ద రెండు పట్టణాల్లో హోండా అమేజ్ బాగా పాపులర్ అయిందని పేర్కొన్నారు.

ఈ కాంపాక్ట్ సెడాన్ అప్ గ్రేడెడ్ వెర్షన్ ను వివిధ రకాల ఫీచర్స్ తో మార్చిలో కంపెనీ ప్రవేశపెట్టింది. కంటిన్యూగా వేరియబుల్ ట్రాన్సిమిషన్(సీవీటీ) కలిగి ఉండటం ఈ అప్ డేట్ ప్రధాన ఫీచర్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సామర్థ్యాలు ఈ కారు కలిగి ఉంది. భద్రతపై ఎక్కువగా దృష్టిసారించిన హోండా అప్ గ్రేడెడ్ వెర్షన్ లో డ్యూయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ ను ఈ కారులో పొందుపరిచింది. భవిష్యత్తులో అన్ని హోండా కార్లు డ్యూయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ తోనే వస్తాయని కంపెనీ పేర్కొంది. సీవీటీ ఆప్షన్ ను ఆఫర్ చేసే మొదటి పెట్రోల్ కాంపాక్ట్ సెడాన్ ఈ కొత్త అమేజ్ నే. దీనివల్ల మంచి ఇంధన సామర్థ్యాన్ని అమేజ్ కలిగి ఉంటోంది. ఈ కారు ధర రూ.5.41లక్షల నుంచి రూ.8.31లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీ) మధ్య ఉంటోంది.  

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Honda  Honda Amaze  compact sedan  2 lakh sales  three years  launch  indian market  

Other Articles