Lenovo Vibe P1 Turbo With 5000mAh Battery Reportedly Launched at Rs. 17999

Big battery lenovo vibe p1 turbo is now available in india

android, lenovo vibe p1 turbo, lenovo vibe p1 turbo price, lenovo vibe p1 turbo price in india, lenovo vibe p1 turbo specifications, mobiles, vibe p1 turbo

Lenovo's Vibe P1 Turbo, which was unveiled in Indonesia earlier this year, is reportedly now available to purchase via offline stores in India.

భారత విఫణిలోకి లెనోవో వైబ్ పీ 1 టర్బో.. నేటి నుంచే అమ్మాకాలు

Posted: 04/21/2016 06:58 PM IST
Big battery lenovo vibe p1 turbo is now available in india

భారత్ స్మార్ ఫోన్ అభిమానుల మదిని దోచేందుకు మరో కోత్త స్మార్ట్‌ఫోన్‌ భారతీయ విఫణిలోకి అడుగుపెట్టింది. ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ లెనోవో అవిష్కరిస్తున్న లెనోవో  వైబ్‌ పీ1 టర్బో స్మార్ట్‌ఫోన్‌ దేశీయ మార్కెట్లో ఇవాళ్లి నుంచి అమ్మకాలను సాగించనుందని సమాచారం. ఇటీవల ఇండోనేషియాలో ఆవిష్కరించిన వైబ్‌ పీ1 టర్బో ఇవాళ్టి నుంచి భారత్‌ స్మార్ట్ ఫోను ప్రియులకు అందుబాటులోకి రానుంది.

లెనోవో సంస్థ ఈ మేరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనను చేయనప్పటికీ.. భారత్ లో అమ్మకాలను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ రీటైలర్ తెలిపారు. భారతీయ మార్కెట్లలోని ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఫోన్లు కొనుగోలు చేయొచ్చని ముంబయికి చెందిన సంస్థ రీటైలర్‌ వెల్లడించారు. దీని ధర రూ. 17,999 ఉంటుందని తెలిపారు. లెనోవో విడుదలపై సంస్థ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

ఫోన్‌ ప్రత్యేకతలు..

* 5.5 అంగుళాల డిస్‌ప్లే
* 1.5 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌
* ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 2 జీబీ రామ్‌
* 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* 13 ఎంపి ఫ్రంట్, 5 ఎంపీ రేర్ కెమెరా
* డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : android  lenovo vibe p1 turbo  big battery  indian stores  

Other Articles