Sensex zooms 568 pts to jump most since Jan 2015

Sensex nifty consolidate gains

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

After logging its worst weekly fall in over six years, the benchmark BSE Sensex on Monday soared by 568 points to 23,554.12 -- index's biggest single-day gain in more than a year

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. 568 పాయింట్ల లాభాంలో సెన్సెక్స్

Posted: 02/15/2016 10:16 PM IST
Sensex nifty consolidate gains

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాలలో పయనించడంతో పాటు అసియా మార్కట్లు నుంచి వచ్చిన సానుకూల పవనాలు కూడా మార్కెట్లు లాభాలలో నడిచేలా చేశాయి. గత ఏడాది జనవరి మాసం నుంచి మార్కట్లు ఎరుగని భారీ లాభాలను ఇవాళ అందుకున్నాయి. దాదాపు సంవత్సర కాలంగా లేని లాభాలను అందుకోవడంతో మదుపరులు కూడా కొనుగోళ్లకు ఆసక్తి కనబర్చారు. దీనికి తోడు మెటల్స్ రంగంలోని కంపెనీల ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నించారు.

 షార్ట్ కవరింగ్ పెద్దఎత్తున జరగడంతో భారత స్టాక్ మార్కెట్ బుల్ హైజంప్ చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ ఎఫ్ఐఐల సెంటిమెంట్ ను పెంచిందని, ద్రవ్యోల్బణం తగ్గిందన్న గణాంకాలు ఈక్విటీలకు మద్దతుగా నిలిచాయని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. నిఫ్టీ సూచికకు అత్యంత కీలకమైన 7,150 పాయింట్లపైన కొనుగోలు మద్దతు కనిపించింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, ఆపై మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 2.50 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

బీఎస్ఈలో మొత్తం 2,776 కంపెనీల షేర్లు ట్రేడ్ కాగా, 1,993 కంపెనీలు లాభాల్లోను, 668 కంపెనీల షేర్లు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి సెన్సెక్స్ 568 పాయింట్ల లాభంతో 23,554.12 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 7,162.95 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 3.47 శాతం, స్మాల్ క్యాప్ 3.35 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 45 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, వీఈడీఎల్, టాటా స్టీల్, హిందాల్కో, ఎల్అండ్ టీ తదితర కంపెనీలు లాభపడగా, భారతీ ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, ఐడియా, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles