gold prices fall to near 6 year low

Gold prices sinks to six year low internationally

gold, gold price, gold rate, gold prices fall to near 6 year low, gold price in mumbai, gold price in india, gold price in hyderabad, gold price in delhi, gold price in kolkatta, Price of gold, Jewelry, Retail Traders, 22-carat prices

Gold fell for a twelfth session out of thirteen on Friday, trading close to a near six-year low on rising bets that the Federal Reserve would hike U.S. rates next month and as investors pull out of bullion-backed funds.

అంతర్జాతీయంగా ఆరేళ్ల కనిష్టస్థాయికి పసిడి ధర

Posted: 11/14/2015 01:27 PM IST
Gold prices sinks to six year low internationally

పసిడి కాంతులు వీడుతోంది. భారత్, చైనా మినహా అన్ని దేశాల్లో బంగారాన్ని విలువైన పెట్టుబడి వస్తువుగా పరిగణిస్తున్న క్రమంలో దానిపై అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్య పరిపతి సమీక్ష ప్రభావం మెండుగా వుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత జీరో స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందన్న వార్త ప్రధానంగా పసిడి ఫ్యూచర్స్ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బులియన్ ఆధారిత ఫండ్లను విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

భారత్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా ఇదే ధోరణి కనబడుతోంది. అంతర్జాతీయంగా ఆరేళ్ల కనిష్టస్థాయికి కుందనం ధరలు పడిపోగా, ఢిల్లీలో మూడు నెలల కనిష్ట స్థాయికి బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి నేపథ్యంలో... ఆభరణాలు, రిటైల్ వర్తకుల కొనుగోళ్లు మందగించడం కూడా దీనికి కారణం. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (కామెక్స్)లో  ఔన్స్ (31.1గ్రా) 1,084 డాలర్లుకు చేరుకుంది. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. అంటే 2010 ఫిబ్రవరి తరువాత ఈ స్థాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పతనం ఇదే తొలిసారి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Price of gold  Jewelry  Retail Traders  22-carat prices  

Other Articles