Pepsi smartphone to debut in China next week

Soft drinks giant pepsi to launch smartphone in china

Pepsi smartphone to debut in China next week, news, pepsi ceo, pepsi mobile, Pepsi P1, pepsi phone, pepsi smartphone, pepsico. permalink, China, Pepsi Co., smartphone, Pepsi p1, China, Pepsi to launch smartphone in China, news, India news,

Soft drinks giant Pepsi Co. is set to launch a smartphone in China as part of a new marketing ploy.

స్మార్ట్ ఫోన్ల రంగంలోకి పెపీ్స.. ప్రపంచ విఫణీలోకి త్వరలో పెప్సీ పీ1

Posted: 10/18/2015 04:38 PM IST
Soft drinks giant pepsi to launch smartphone in china

కూల్ డ్రింక్  వ్యాపార రంగంలో రారాజు అయిన పెప్సీ మరో  కొత్త రంగంలోకి అడుగు పెడుతోంది.  ప్రపంచాన్ని శాసిస్తున్న స్మార్ట్  ఫోన్ల  తయారీ రంగంలోకి  ఈ కంపెనీ ప్రవేశిస్తోంది. పెప్సీ పి1  పేరుతో   ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి  తీసుకొస్తోంది. ఇప్పటికే వస్త్ర, సోడా, ఫుడ్ వ్యాపారంలో దూసుకుపోతున్న పెప్సీ స్మార్ట్ ఫోన్  తయారీ రంగంలో కూడా తన  ప్రత్యేకతను  చాటుకునేందుకు  సిద్ధమవుతోంది. వ్యాపార రంగాన్ని విస్తరించే ఉద్దేశంతో కాకుండా వినియోగదారుల హృదయాలను గెలుచుకునేందుకే తమ ప్రయత్నమని సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఆకర్షణీయమైన ఉత్పత్తులు, కొత్త కొత్త ఆలోచనలతో వినియోగాదారులను తమ వైపు తిప్పుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. తమ ఉత్పత్తుల పట్ల  కొనుగోలుదారుల అభిమానాన్ని ఈ కొత్త ఫోన్ ద్వారా  నిలబెట్టుకుంటామన్నారు. ఫుడ్ అండ్ బెవరేజ్ రంగంలో ప్రపంచంలో మూడో అతపెద్ద వ్యాపాసంస్థగా ఎదిగిన పెప్సీ, మొబైల్ ఫోన్లలో ప్రకటనల ద్వారా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు   రంగం సిద్ధం చేసుకుంది.  ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ బిజినెస్ లో కాలు మోపినట్టు  సంస్థ తెలిపింది. చైనీ సోషల్ మీడియాలో వైబోలో ఫోన్ స్పెసిఫికేషన్స్ తో ఒక ఇమేజ్ కూడా లీక్ అయ్యింది,

 దీని ప్రకారం  ఈ ఫోన్ లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ ఎస్ఓసీ, 2జీబీ ర్యామ్, 16 gb ఇంటర్నెల్ స్టోరేజ్, 13ఎంపీ వెనక కెమెరా, 5 ఎంపీ ముందు కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉండనున్నాయి. చూడటానికి దీని వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చైనాలో దీని ధర మన కరెన్సీలో రూ. 13,350 .అక్టోబర్ 20న బీజింగ్ లో తమ ఫోన్ ను  లాంచ్ చేయనున్నట్టు సంస్థ బ్లాగ్ లో తెలిపింది. పెన్సీ లోగోతో, చైనాకు  చెందిన షెంజెన్ టెక్నాలజీ సంస్థ దీన్ని తయారుచేస్తోంది. అయితే పెప్సీ పి 1  ప్రస్తుతానికి ఒక్క చైనాలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pepsi Co.  smartphone  Pepsi p1  China  

Other Articles