Sensex ends 236 points down, Nifty below 8,500

China earnings fear pinch nifty cracks 8500 sensex weak

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

What worried Indian investors was devaluation of Chinese currency. The People's Bank of China allowed the yuan to depreciate almost 2 percent against the US dollar to levels last seen three years ago, sending a shock through currency markets.

కరెన్సీ విలువను తగ్గించిన చైనా.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 08/11/2015 06:31 PM IST
China earnings fear pinch nifty cracks 8500 sensex weak

ఆర్థిక సంక్షోభాన్ని భర్తి చేసుకునే నేపథ్యంలో కరెన్సీ యువాన్ విలువను తగ్గింపు నిర్ణయం తీసుకున్న చైనా ధాటికి ప్రపంచ దేశ స్టాక్ మార్కెట్లతో పాటు మన దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కుదుపులకు గురై భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు కూడా మదుపరులను నిరాశపర్చడం.. దానికి తోడు పార్లమెంటు సమావేశాలు ప్రతిష్టంభనతో కీలక బిల్లులు సభలోకి రాకపోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో స్టాక్ మార్కెట్ల పతనానికి కారణంమయ్యాయి.

ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ సాగించగా, చైనా యువాన్ కర్సెనీ విలువను రెండు శాతం మేర తగ్గించడంతో పాటు బ్యాంకింగ్  దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిరాశజనక ఫలితాలను ప్రకటించడంతో మారెట్ల సెంటిమెంట్ దెబ్బతినింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలలో ప్రతిష్టంభన,  కీలక బిల్లులు  పెండింగ్ లో పడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 27 వేల 866 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా మరోమారు 8500 మార్కుకు దిగువకు చేరింది. నిప్టీ 63 పాయింట్లను కోల్పోయి 8462 పాయింట్ల వద్ద ముగిసింది.

ఐటీ, టెక్నాలజీ సూచీలు మినహా అన్ని సెక్టార్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. బ్యాంకింగ్‌, అటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, చిన్నతరహా పరిశ్రమల రంగానికి చెందిన సూచీలు అధికంగా నష్టపోగా, కన్జూమర్ డ్యూరబుల్, ఎప్ఎంజీసీ, హెల్త్ కేర్, మధ్య తరహా పరివ్రమల సూచీలు, స్వల్పంగా నష్టపోయాయి. ఈ క్రమంలో టాటాస్టీల్, ఎస్ బీఐ, టాటాపవర్, హిందాల్కో, కోల్ ఇండియా సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూడగా, ఇన్ఫోసిన్,  బోష్, టెక్ మహీంద్రా, జీ ఎంటర్ టైన్ మెంట్; టీసీఎస్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను గడించాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  RBI  

Other Articles