Asia Pacific Market: Stocks down as yuan fall further

Market nervous on gst logjam and yuan sensex dives 354 pts

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The further devaluation of the yuan only added to further depreciation in the rupee, with the Indian currency hitting a 2-year low in trade today. The Indian currency is edging closer to the 65 to a dollar mark

స్టాక్ మార్కెట్లలో నక్కల కూతలు.. సూచీలకు భారీ నష్టాలు

Posted: 08/12/2015 06:27 PM IST
Market nervous on gst logjam and yuan sensex dives 354 pts

ఆర్థిక సంక్షోభాన్ని భర్తి చేసుకునే నేపథ్యంలో కరెన్సీ యువాన్ విలువను మరింతగా తగ్గిస్తూ మరోమారు చైనా నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ దేశ స్టాక్ మార్కెట్లతో పాటు మన దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కుదుపులకు గురై భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో నక్కల కూతలు వినిపించాయి. దీనికి తోడు పార్లమెంటు సమావేశాలు ప్రతిష్టంభనతో కీలక బిల్లులు సభలోకి రాకపోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో స్టాక్ మార్కెట్ల పతనానికి కారణంమయ్యాయి.

ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. భారీ కుదుపులకు గురైన దేశీయ సూచీలు ఎట్టకేలకు నష్టాలతోనే ముగిసాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 8400మార్కు దిగవన ట్రేడింగ్ సాగించింది. చైనా కర్సెనీ యువాన్ విలువను మరింత తగ్గించడం దేశీయ సూచీలను కుదిపేసింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలలో ప్రతిష్టంభన,  కీలకమైన జీఎస్ టీ బిల్లును సభలో చర్చ జరగకపోవడతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి 354 పాయింట్లు కోల్పోయి సెన్సెక్స్ 27 వేల 512 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా మరోమారు 8400 మార్కుకు దిగువకు చేరింది. నిప్టీ 113 పాయింట్లను కోల్పోయి 8349 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ నేపథ్యంలో ఇవాళ 711 సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, 2124 సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 160 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఐటీ, టెక్నాలజీ సూచీలు మినహా అన్ని సెక్టార్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. బ్యాంకింగ్‌, అటో, క్యాపిటల్ గూడ్స్, ఎప్ఎంజీసీ, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, చిన్నతరహా పరిశ్రమల రంగానికి చెందిన సూచీలు సహా మధ్య తరహా పరివ్రమల సూచీలు నష్టాల్లో పయనించాయి. ఈ క్రమంలో వేదంత. హిందాల్కో, బిసిపీఎల్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎస్ బి ఐ సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూడగా, హెచ్ సి ఎల్ టెక్, ఇన్ఫోసిన్,  టెక్ మహింద్రా, సన్ ఫార్మా, టీసీఎస్ సంస్థల షేర్లు అధిక లాభాలను గడించాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  RBI  

Other Articles