Raghuram Rajan Says, World Economy May Be Slipping Into 1930s Depression

Rbi governor raghuram rajan warns of 1930s depression problems for global economy

raghuram rajan, rbi, raghuram rajan 1930s depression, reserve bank of india, rbi raghuram rajan, raghuram rajan economy, india gdp, india economy, World economy, 1930s depression, Reserve Bank of India, RBI

Raghuram Rajan has asked central banks from across the world to define "new rules of the game."

1930 నాటి మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం... రాజన్ ప్రమాద ఘంటికలు

Posted: 06/26/2015 06:00 PM IST
Rbi governor raghuram rajan warns of 1930s depression problems for global economy

రెండు ప్రపంచ యుద్దాలకు మధ్య అత్యంత దారుణ స్థితిలోకి జారుకున్న ఆర్థిక మాద్యం నాటి పరిస్థితులలోకి మళ్లీ వెళ్లే ప్రమాదముందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రమాద ఘంటికలు మ్రోగించారు. బ్యాంకింగ్ రంగ వ్యవస్థలు తక్షణం స్పందించకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆంధోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న బ్యాంకింగ్ రంగ వ్యవస్థలు సమిష్టిగా చేరి బ్యాంకుల లావాదేవీలు సల్పే విషయంగా నూతన నియమ నిభంధనలు తీసుకుంటే తప్ప ప్రమాదం నుంచి బయటపడలేమని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

లండన్ బిజినెస్ స్కూల్లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పలు దేశాలు బ్యాంకులు పోటీ పడుతూ పరపతి సమీక్షలు జరుపుతూ, విధాన నిర్ణయాలను సరళీకరిస్తూ సాగడం ప్రమాద హేతువని ఆయన అన్నారు. అయితే ఇ:డియాలో పరిస్థితి వేరుగా వుందని రాజన్ అభిప్రాయపడ్డారు. 85 ఏల్ల నాటి కష్టాల్లోకి ప్రపంచం జారకముందే, ఆర్థికవేత్తలు చర్చింది పరిస్థితులు చక్కబరచాలని ఆయన సలహా ఇచ్చారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన పని కాబట్టి ఎ లా ముందుకు వెళ్లాలన్న విసయంలో తానేమి వ్యాఖ్యానించబోనని అన్నారు. ఇదే సమయంలో గతం మరోసారి రిపీట్ అవుతుందేమోనన్న ఆంధోళనను కూడా రఘురామ్ రాజన్ వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  World economy  1930s depression  Reserve Bank of India  RBI  

Other Articles