Celkon Launches Its First Mobile Manufacturing Plant in Telangana

Celkon opens phones manufacturing unit in hyderabad

Telangana, Murali Retineni, Executive Director, Company Expansion, Celkon Mobiles Chairman and Managing Director, Celkon Mobiles, Y Guru, International Standard Organisation certified, Central Government, 'Make in India' initiative, inaguarates, phones, manufacturing unit, Hyderabad, KTR

Indian mobile phones-maker Celkon launched its first state-of-the-art manufacturing facility in Medchal, Telangana, a company statement said.

మెక్ ఇన్ తెలంగాణ.. 5లక్షల యూనిట్లు టార్గెట్ గా సెల్ కాన్ మొబైల్స్..

Posted: 06/27/2015 07:41 PM IST
Celkon opens phones manufacturing unit in hyderabad

మేక్ ఇన్ ఇండియాకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం స్పూర్తితో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లో ప్రారంభించిన తమ సెల్‌కాన్‌ సంస్థ టార్గెట్ నెలకు 7 లక్షల మేర మొబైల్‌ హ్యాండ్‌సెట్ల ఉత్పత్తి చేయడమేనని సదరు సంస్థ  చైర్మన్ అండ్ మేజేజింగ్ డైరెక్టర్ వై గురు అన్నారు. ఈ ప్లాంటును శుక్రవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్బాన్న పురస్కరించుకుని  సెల్‌కాన్‌ సీఎండీ వై. గురు  మాట్లాడుతూ  తొలుత నెలకు 2 లక్షల ఫోన్లను అసెంబుల్‌ చేయనున్నామని తెలిపారు.  ఈ సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్ల పెంచుతామని అన్నారు.   దేశీయంగా తయారీతో మోడళ్ల ధర 7`8 శాతం తగ్గనుందన్నారు.  ఇప్పటి వరకు మేడ్‌ ఇన్‌ చైనా పేరుతో వచ్చిన కంపెనీ ఫోన్లు ఇక నుంచి మేడ్‌ ఇన్‌ ఇండియాగా కూడా  రానున్నాయని  ఈ  యూనిట్‌ ఏర్పాటుపై 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేసినట్లు  తెలిపారు.

దక్షిణాదిన అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటవడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇతర కంపెనీలూ దక్షిణాదికి వచ్చేందుకు మార్గం సుగమం అయిందని అన్నారు. ప్రారంభంలో ఇక్కడ ఫీచర్‌ఫోన్లు, ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తామని, తదుపరి దశలో హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీని కూడా చేపడతామని తెలిపారు. ఈ యూనిట్‌లో 500 మంది నిపుణులు,  స్కిల్డ్‌ సిబ్బంది పనిచేస్తారని, వాకు కాకుండా అదనంగా మరి కొంత మంది సాదారణ ఉద్యోగులను కూడా తీసుకుంటామని తెలిపారు. తాము నెలకి ఏడు లక్షల హ్యాండ్‌సెట్లు విక్రయిస్తున్నామని తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Celkon  Mobiles  Telangana  make in India  

Other Articles