Service tax to rise to 14% from tomorrow; mobile calls, hotels to be costlier

Mobile hotel other services to be costlier from june 1

Service tax, Service tax hike, Budget 2015-16, Arun Jaitley, Narendra Modi, Phone bill, railway tickets, air tickets, banking services, construction services, credit card service

You will have to shell out more while using mobiles, eating out and travelling from Monday, June 1, as the service tax rate rises to 14 per cent.

నేటి నుంచి అదనపు సర్వీసు పన్ను బాదుడు షురూ..

Posted: 05/31/2015 10:51 PM IST
Mobile hotel other services to be costlier from june 1

ప్రధాన మంత్రి మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మరో అదనపు భారం సామాన్య ప్రజలు మొదలుకుని అన్ని వర్గాల ప్రజలపై పడింది. నేటి నుంచి అదనపు సర్వీసు పన్ను భారం మధ్యతరగతి, ఉన్నత అదాయవర్గాల ప్రజలపై పడనుంది. క మీదట దేశ ప్రజల జేబులకు ప్పటిదాకా చెల్లిస్తున్న సర్వీసు ట్యాక్స్(సేవా పన్ను) సోమవారం నుంచి మరింత పెరుగుతోంది. 12 శాతంగా ఉన్న ఈ ట్యాక్స్‌ను ఇక నుంచి 14 శాతానికి పెంచుతున్నారు. పెపైచ్చు వినోద రంగానికి సంబంధించిన కొన్ని సేవలతో పాటు ఇప్పటిదాకా సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రాని పలు సేవల్ని సోమవారం నుంచి దీని పరిధిలోకి తెస్తున్నారు.

హోటల్లో, రెస్టారెంట్లో భోజనం మాత్రమే కాదు. మొబైల్, ఇంటర్నెట్, విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్‌లో తీసుకునే రైలు టికెట్లు, కేబుల్ సర్వీసులు, బ్యూటీ పార్లర్స్, హెల్త్ క్లబ్స్, వినోదం... ఇలా దాదాపు అన్ని సేవలకూ జూన్ 1 నుంచీ అదనపు భారం పడబోతోంది. సేవల పన్ను 12.36 శాతం (విద్యా సెస్సు కూడా కలిపి) నుంచి 14 శాతానికి పెరుగుతుండటమే దీనికి కారణం. దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థ 2016 ఏప్రిల్ 1 నుంచి  ‘వస్తువులు, సేవల పన్ను’గా (జీఎస్‌టీ) మారుతోంది. ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా సేవల పన్ను రేట్లను మారుస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవలి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు.
 
ప్రతి ఒక్కరికీ భారమే: పర్యాటకం, ఆతిథ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, రవాణా, రియల్టీ, ఆటో రంగాలపై ప్రధానంగా ఈ భారం పడే అవకాశాలున్నాయి. అసలే మందగమనంలో ఉన్న రియల్టీ రంగం తాజా పరిస్థితి పట్ల ఆందోళన చెందుతోంది. సేవల పన్ను పెంపు వల్ల నిర్మాణ సామగ్రి వ్యయం పెరిగి అసలే ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణరంగం కుదేలవుతుందని రియల్టీ సంస్థలు అంటున్నాయి. ప్రతి ఒక్కరిపై ఏదో  రకంగా సేవల పన్ను పెంపు భారం పడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సామాన్యునికిది పెను భారమనడంలో సందేహం లేదు.  సేవల పన్ను ద్వారా కేంద్రానికి వచ్చిన మొత్తం గత ఆర్థిక సంవత్సరం రూ.1.68 లక్షల కోట్లు. తాజా పెంపుతో ఈ మొత్తం 25 శాతం వృద్ధితో రూ. 2.09 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే... దాదాపు రూ. 40వేల కోట్లు జనం జేబుల్లోంచి ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయన్న మాట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Service tax  GST  Service tax rates  

Other Articles