భారతీయ మోబైల్ ఫోన్ మార్కెట్ సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ మరోమారు తమ సత్తాను చాటుకుంటూ మార్కెట్ లో సంచలనాలకు తెరతీయనుంది. దశాబ్దం క్రితం అప్పుడున్న మార్కెట్ లో ప్రవేశించిన రిలయన్స్ అప్పటి మార్కట్ లో హల్ చల్ చేసింది. రిలయన్స్ రాకతో గ్రామీణ భారతంలోని ప్రతీ పౌరుడికి సెల్ ఫోన్ పరిచయం కావడంతో పాలు వాటిని వారి వినియోగంలోకి తీసుకువచ్చింది. సరిగ్గా అదే విప్లవం వ్యూహాన్ని మరోసారి అమలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమవుతోంది. అనుబంధ మోబైల్ సంస్థ రిలయన్స్ జియో (ఆర్‌జియో) ద్వారా 4జీ సర్వీసులు ప్రవేశపెట్టబోతున్న కంపెనీ.. రానున్న పదేళ్ల కాలంలో మార్కెట్ లోని 10 శాతం వాటాతో పాటు 9 శాతం మేర రివెన్యూను సాధించాలని ప్రణాళికలు వేస్తుందని బెర్న్ స్టీన్ రిసర్చ్ నివేదిక స్పష్టం చేసింది.
ఇందులో భఆగంగా కేవలం 30 డాలర్లకు (సుమారు రూ. 1,800) 4జి ఫోన్ సహా అత్యంత చౌక ధరకు ప్యాకేజీని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చౌక హ్యాండ్‌సెట్స్ కోసం చైనా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో హువాయ్, జియోనీ, షియోమీ తదితర సంస్థలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అత్యంత చౌక సేవల ద్వారా కస్టమర్లను తమ వైపు ఆకర్షించుకోవడంపైనే రిలయన్స్ దృష్టి పెడుతుందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఫ్రోఫెసర్ క్లేటన్ ఎం క్రిస్టెన్ సెన్ ఈ మేరకు నివేదిక వివరాలను తెలిపారు.
సర్వీసులు ప్రారంభించిన 50 గంటల్లో 50 లక్షల కస్టమర్లను సాధించాలని కంపెనీ నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపాయి. ఈ వ్యూహాలు గానీ ఫలించినట్లయితే రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యక్తిగతంగా కీలకమైన విజయం సాధించినట్ల అవుతుందని పేర్కొన్నాయి. 2003లో పోస్ట్ కార్డ్ కన్నా తక్కువ రేటుకు ఫోన్‌కాల్ నినాదంతో రిలయన్స్.. టెలికం సర్వీసులు ప్రారంభించడంలో ముకేశ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న మొబైల్ మార్కెట్లో అత్యంత తక్కువగా దాదాపు రూ. 500కే హ్యాండ్‌సెట్స్‌ను అందుబాటులోకి తెచ్చి రిలయన్స్ సంచలనం సృష్టించింది. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు 4జీ సర్వీసులతో ముకేశ్ సంస్థ రిలయన్స్ జియో.. ఆనాటి మ్యాజిక్‌ను మరోసారి సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
రిలయన్స్ జియో విధ్వంసకరమైన ఆఫర్లతో టెలికం మార్కెట్లో సంచలనం సృష్టించనుందని అంచనాలు నెలకొన్నాయి. ఇతర కంపెనీల కొనుగోళ్లు, విలీనాలతో ముందుకు దూసుకుపోయి భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ స్థాయిలో టాప్ త్రీ సంస్థల్లో ఒకటిగా ఆర్‌జియో ఎదుగుతుందని భావిస్తున్నారు. రిల యన్స్ జియో ఎంట్రీ తో మార్కెట్ మీద ప్రభావాలపై రూపొందించిన అధ్యయన నివేదికలో బెర్న్‌స్టెయిన్ రీసెర్చ్ ఈ విషయాలు తెలిపింది. కంపెనీ పదేళ్లలో 10% సబ్‌స్క్రయిబర్స్‌ను, ఆదాయాల్లో 9% వాటాను దక్కించుకోగలదని పేర్కొంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more