sbi atm centers to act as postal box soon

Postal department launches atm facility

postal department launches atm facility, state bank of india atms, post box collection centers, postal department and sbi aggrement, State Bank of India, ATM machines, Postal department, business news,

state bank of india atms will also serve as post box collection centers soon as postal department and sbi enter into aggrement.

త్వరలో పోస్టాఫీసు సేవలనందించనున్న ఎస్బీఐ ఏటీయం కేంద్రాలు

Posted: 05/03/2015 09:23 PM IST
Postal department launches atm facility

ఎస్‌బీఐ తమ ఏటీఎం మెషీన్ల ద్వారా ఉత్తరాలు బట్వాడా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్.. తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకోడానికి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే తొలుత స్పీడ్ పోస్టు సౌకర్యం మాత్రమే కల్పించనున్నారు. వినియోగదారులు ఉత్తరాలు పంపేందుకు వీలుగా ఏటీఎంల సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేస్తారు. ఏటీఎం కార్డు పెట్టగానే తెరపై  స్పీడ్‌పోస్టు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏటీఎం మిషన్ పక్కన బరువు తూచే చిన్న యంత్రం కూడా ఉంటుంది. ఏటీఎంలో స్పీడ్ పోస్టు ఆప్షన్ క్లిక్ చేశాక పక్కనున్న తూకంపై మీ కవర్ పెట్టగానే పోస్టుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుపుతుంది.

ఆ మొత్తాన్ని ఏటీఎం ద్వారా చెల్లించిన తర్వాత మిషన్ నుంచి వచ్చే రషీదును కవర్‌కు అతికించి పక్కనే ఏర్పాటు చేసిన క్లియరెన్స్ బాక్సులో వేయాలి. తపాలా శాఖ సిబ్బంది వచ్చి పోస్టు చేయాల్సిన కవర్‌లను సేకరిస్తారు. ఏటీఎం ద్వారా పంపిన స్పీడ్ పోస్టుల వివరాలు ఎప్పటిప్పుడు ఎస్‌బీఐ, తపాలా శాఖకు ఆన్‌లైన్ ద్వారా చేరతాయి. ఆ వివరాలను బట్టి పోస్టల్ సిబ్బంది వచ్చి ఎప్పటికప్పుడు ఏటీఎంలకు వెళ్లి వాటిని సేకరిస్తారు. వినియోగదారులు చెల్లించే స్పీడ్ పోస్టు చార్జీల్లో కొంత మొత్తం కమిషన్ రూపంలో ఎస్‌బీఐకి చేరుతుంది. తపాలా శాఖ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ సుధాకర్ ఈ కొత్త ఆలోచన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టును ఒడిషాలోని భువనేశ్వర్ ఐదు రోజుల క్రితం ప్రారంభించారు. ఇక దీనిని దేశవ్యాప్తంగా విస్తృతం చేసే పనిలో పోస్టల్ శాఖ వుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : State Bank of India  ATM machines  Postal department  

Other Articles