Gold rate fall down from the stock market effect

sensex, nifty, bse, goldrates, us, dollar

gold rate fall down from the stock market effect. Indian benchmark indices slumped in trades on Monday, tracking weak overseas markets. The Sensex plunged 604 points to 28,845 and the 50-share Nifty fell below its important psychological level of 8,800 to close at 8,757, down 181 points.

దిగివచ్చిన బంగారం.. పడిపోయిన స్టాక్ మార్కెట్

Posted: 03/09/2015 04:47 PM IST
Gold rate fall down from the stock market effect

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 604 పాయింట్ల నష్టంతో 28,844 వద్ద ముగియగా, నిఫ్టీ 181 పాయింట్లను కోల్పోయి 8,756 పాయింట్ల వద్ద ముగిసింది.గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీగా పతన కావటంతో అది దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. మార్కెట్లు డాలర్‌ మరింత బలపడటం, జనవరి పారిశ్రామిక డేటాతోపాటు , కన్స్యూమర్‌ ప్రైజ్‌ ఇండెక్స్‌   డేటా కూడా ఈ గురువారం రానుండంతో  మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం పడడంతో  మరింత కుదేలయ్యాయి.

ఓ వైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూడగా, మరోవైపు బులియన్  మార్కెట్ లో బంగారం ధరలు కూడా పతనం అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గింది. దాంతో పసిడి ధరలు మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఒక్కరోజులోనే గ్రాము బంగారం ధర రూ.520 తగ్గింది.  ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,500గా ఉంది. బంగారం ధరలు మరింతే తగ్గే అవకాశం కనిపిస్తోంది. 25వేల దిగువకు కూడా ధరలు పడిపోయే అవకాశం ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పడిపోతున్నాయి. అయితే గత కొంత కాలంగా బంగారు ధరలు పతనమవుతాయన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. కాగా బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు మాత్రం తక్కువే అంటున్నారు నిపుణులు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  bse  goldrates  us  dollar  

Other Articles