Apple watch may launch in india in june july

Apple Watch may launch in India in June-July, Apple Smart Watch, Apple Watch available in nine countries from april, basic apple watch price will start at $349, gold model watch price above $17,000, Apple Watch may cost well over Rs 30,000, SmartWatch, Apple watch, wearable technology, Tim Cook, Apple, ResearchKit, MacBook Air, Apple watch, Apple MacBook

Apple Watch will be available from april in nine countries; the schedule does not include India. The prices will start at $349 and go above a whopping $17,000 for the gold model.

జూన్, జూలైలో భారతీయ విఫణిలోకి ఆఫిల్ వాచ్ లు..!

Posted: 03/10/2015 05:03 PM IST
Apple watch may launch in india in june july

ప్రపంచవ్యాప్త టెక్ ప్రియులంతా ఏడాది నుంచి ఎదురుచూస్తున్న ఆపిల్ స్మార్ట్‌వాచ్ వచ్చే ఏడాదిలో ప్రపంచ విఫణీలోకి అడుగుపెడుతోంది. మణికట్టుకు తొడిగే ఈ బుల్లి కంప్యూటర్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఆవిష్కరించింది. ఆపిల్ వాచ్ స్పోర్ట్, ఆపిల్ వాచ్, అండ్ ఆపిల్ వాచ్ ఎడిషన్ అను మూడు రకాలలో ఆపిల్ వాచ్ ను సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు. అన్ని వేరియంట్లలోనూ రెండు సైజులను అందుబాటులో వున్నాయి. 38 మిల్లీమిటర్లు, 42 మిల్లీమీటర్ల సైజులలో అపిల్ వాచ్ లు అందుబాటులో వున్నాయి.

ఈ వాచ్ కనీస ధర అమెరికాలో 349 డాలర్లుగా ఉండగా, భారతీయ కరెన్సీలో బేసిక్ అపిల్ స్పోర్ట్ వాచ్ 22 వేల రూపాయలుగా వుంది. ఇక ఇందులో అత్యధిక రేజ్ లో బంగారు వాచ్ కావాలంటే సుమారుగా పది లక్షల రూపాయలను వెచ్చించాల్సి వస్తుంది. ముందుగా వచ్చే నెల (ఏప్రీల్ )లో ఇది ప్రపంచంలోని తొమ్మిది దేశాలలోని ప్రజలకు అందుబాటులో వుంటుండగా, భారత్ విఫణీలోకి మాత్రం జూన్, జూలై మాసాల్లో రానున్నట్లు సమాచారం.

ముందుగా అమెరికా, చైనా, జపాన్, హాంగ్ కాంగ్, అస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకె దేశాలలోని వినియోగదారులకు ఈ వాచ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఐఫోన్‌తో అనుసంధానం చేసుకోగలిగే ఈ స్మార్ట్‌వాచ్‌లో పలు అప్లికేషన్లు (యాప్), సెన్సర్లు పొందుపర్చివున్నాయి. ముఖ్యంగా హెల్త్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన యాప్‌లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే సులువుగా గమ్యానికి చేరుకునేందుకు తోడ్పడే మ్యాప్ సాఫ్ట్‌వేర్‌ను కూడా ఈ వాచ్‌లో పొందుపర్చారు. తమ కస్లమర్లు మనస్సులను ఈ వ్యాచ్ దోచుకుంటాయని ఆపిల్ సీఈఓ టీమ్ కుక్ వాచ్ అవిష్కరణ సందర్భంగా అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Apple  Smart Watch  

Other Articles