Rose in january cpi inflation markets gained for the third straight session

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, CIP inflation, January Inflation, India inflation, India price rise, India growth

January CPI inflation rose to 5.11 percent measured on new base year of 2012 as against 4.28 percent month on month, government data said on Thursday.

జనవరిలో పెరిగిన ఆహార ద్రవ్యోల్భణం.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

Posted: 02/12/2015 07:06 PM IST
Rose in january cpi inflation markets gained for the third straight session

దేశంలో ఆహార ద్రవ్యోల్భనం మళ్లీ పెరిగింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల వ్యక్తం చేసిన అనుమానాలను నిజం చేస్తూ జనవరి మాసంలో ఆహార ద్రవ్యోల్భణం 5.11 శాతానికి పెరిగిందని కేంద్ర విడుదల చేసిన తాజా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతుకు క్రితం నెల డిసెంబర్ 2014తో పోల్చితే ద్రవ్యోల్భణం 0.83 శాతం పెరిగిందని కేంద్ర గణంగాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ మాసంలో నమోదైన 4.28 శాతం ద్రవ్యోల్భణం.. క్రమంగా జనవరి మాసంలో 5.11 శాతానికి పెరిగింది. గ్రామీణ భారతంలో ద్రవ్యోల్భణం 5.25గా నమోదు కాగా, పట్టణ భారతంలో 4.96శాతంగా నమోదైంది.

కాగా ఇటీవల ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ ద్రవ్యోల్భణం అంశం ఇంకా రిజర్వు బ్యాంకును అందోళన పరుస్తుందని అన్నారు.  ప్రతి ద్రవ్యోల్భణ వాతావరణలో కొనసాగేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నా ఈ అంశంతో రిజర్వుబ్యాంకు ఇంకా అందోళన చెందుతూనే వుందన్నారు. ప్రతి ద్రవ్యోల్భణ విధానాలను అవలంభించడం మనకు చాలా సులభమన్నారు. ఎందుకంటే ఎక్కడైతే ద్రవ్యోల్భణం పెరుగదలకు కారణమవుతుందో.. అక్కడ తప్ప అన్ని వాతావరణాలలో తాము పోరాడుతున్నామన్నారు. దీన్ని బట్టి తామింకా సంప్రదాయ ద్రవ్య విధానంలోనే వున్నామని రఘురామ్ రాజన్ అన్నారు.

మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడువ రోజు కూడా లాభాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్ 271 పాయింట్ల లాభాన్ని ఆర్జించి 28 వేల 805 పాయంట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 84 పాయింట్ల లాభంతో 8 వేల 712 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బిహెచ్ఇఎల్, సిప్లా, గెయిల్, మారుతి సుజుకీ సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, హిందుస్తాన్ యూనీ లీవర్, బజాజ్ అటో, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, ఎస్ బి ఐ సంస్థల షేర్లు నష్టాలను చవి చూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  January Inflation  India inflation  

Other Articles