Sensex logs worst week in 2 months ahead of delhi polls

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE auto shares, health care shares, banking shares, power shares, oil & gas shares, consumer durable shares

Shares of auto, healthcare, banking, power, oil & gas and consumer durable were among the major laggards of the day.

వారం ఆసాంతం నష్టాలే.. రెండు నెలల కనిష్టస్థాయికి సెన్సెక్స్

Posted: 02/06/2015 05:58 PM IST
Sensex logs worst week in 2 months ahead of delhi polls

రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బెడిసి కోట్టడంతో.. గత ఆరు రోజులుగా దేశీయ సూచీలు వరస నష్టాలను చవిచూశాయి. ఇవాళ కూడా దేశీయ సూచీలు అమ్మకాల ఒత్తడికి లోను కావడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. దీంతో రెండు నెలల కనిష్ట స్థాయికి మార్కెట్ల చేరుకున్నాయి. దీనికి తోడు విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలు కూడా మార్కెట్లను కుంగదీశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం కూడా షేర్ మార్కెట్ పై ప్రభావాన్ని చూపింది.

అటో, హెల్త్ కేర్, బ్యాంకింగ్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్ రంగాల సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా సెన్పెక్ 113 పాయింట్లను నష్టపోయి 28 వేల 892, పాయింట్ల వద్ద ముగియగా, మొత్తం వారంలో 465 పాయింట్లను నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 87 మార్కుకు దిగువకు చేరింది. నిఫ్టీ 51 యాభై పాయింట్లను కొల్పోయి ఎనమిది వేల 661 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో హెచ్ డీ ఎఫ్ సీ, ఇన్పోసిస్, సీసాగోవా, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్  సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, టాటా మోటార్, బిహెచ్ఈఎల్, సన్ ఫార్మ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, మహీంధ్ర అండ్ మహీంద్రా సంస్థ షేర్లు నష్టాలను చవి చూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles