Rbi rate cut markets lap up

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, RBI, RBi rate cut, Repo rate, Nifty, Stocks, Sensex today

Stock markets cheered the RBI's surprise move to cut repo rate with the benchmark Sensex on Thursday surging 728.73 points in its biggest single-day gain since May 2009 to end at 28,075.55 on the back of all-round buying.

రెపో రేట్ ఎఫెక్ట్..! లాభాలతో దూసుకుపోయిన మార్కెట్..!!

Posted: 01/15/2015 06:27 PM IST
Rbi rate cut markets lap up

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమై, లాభాల్లో కొనసాగి, భారీ లాభాలతో దూసుకెళ్లి ముగిశాయి. విదేశీ మార్కెట్ల నుంచి వ్యతిరేక పవనాలు వీచినా.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటనతో ముదుపరులు సెంటిమెంట్లు బలపడి మార్కెట్లు దూసుకెళ్లాయి. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధానంపై సమీక్షించి రెపో రేట్లు తగ్గిస్తారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు దూసుకెళ్లాయి. ఉదయం రఘురామ్ రాజన్ సమీక్ష తరువాత.. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంది. 2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణం 6శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో అప్పటి వరకు వంద పైచిలుకు పాయింట్ల లాభంతో పయనించిన మార్కెట్లు .. నిర్ణయం తరువాత భారీ లాభాలను ఆర్జించారు. 2009 మే నెల తరువాత అంతటి లాభాలతో  మార్కెట్ దూసుకెళ్లింది. ముగింపు సమయానికి సుమారు 729 పాయింట్ల లాభలను ఆర్జించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 729 పాయింట్లు లాభపడి 28,076 వద్ద, నిఫ్టీ 217 పాయింట్లు లాభపడి 8,494 వద్ద ముగిసింది. బ్యాంకులు, రియాల్టీ షేర్లు బాగా లాభపడ్డాయి. డీఎల్ఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, హిందాల్కో తదితర షేర్లు స్వల్ప నష్టాలు చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles