Indian swiss officials to meet soon

Black money, Switzerland, India, Swiss banks, Swiss black money

Black money issue: Indian, Swiss officials to meet soon

నల్లధనంపై త్వరలో స్విస్ హైలెవల్ కమిటీతో భారత్ భేటీ

Posted: 10/10/2014 11:56 AM IST
Indian swiss officials to meet soon

ధేశంలో వున్న సంపన్నుల డబ్బు వివరాలు త్వరలో భయటకురానున్నాయి. పన్నును తప్పించుకుని ఖండాంతరాలు ఎగురుకుంటూ వెళ్లిన డబ్బు వివరాలు త్వరలో కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. సప్త సముద్రాలు దాటి వెళ్లిన డబ్బును తిరిగి దేశంలోనే రానుంది. విదేశాల్లో డబ్బును దాటిన కుబేరులు, నల్లకుబేరులుగా ముద్రపడటానికి ఎంతో సమయం లేదు. త్వరలోనే సంపన్నులు డబ్బు వివరాలు వెల్లడవుతాయన్న సమాచారంతో.. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఈ విషయమై త్వరలోనే భారత్, స్విస్ ప్రభుత్వ అధికారులు హై లెవల్ కమిటీ భేటీ కానుంది. ఈ నెల చివరి వారంలో స్విస్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో మన దేశ ఉన్నతాధికారులు భేటీకానున్నట్లు సమాచారం. ఈ భేటీ నల్లధన కుబేరుల వివచాలతో పాటు అక్కడి బ్యాంకులో మనవారు దాచుకున్న డబ్బుల వివరాలను కూడా వారు దేశ ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. నల్లధనం వెనక్కు తీసుకువచ్చే అంశంలో వున్న చిక్కుముడులన్నింటినీ తొలగించే అవకాశాలున్నాయి.

కేంద్రంలో కొలువుదీరిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీ మేరకు..ఆయన నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చే అంశంలో దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో స్వస్ అధికారులు కూడా నల్లధన కుబేరుల జాబితాను అందించుందుకు సిద్దమయ్యారు. కాగా భారత్ ప్రభుత్వ అధికారులతో తమ దేశ ఉన్నతాధికారుల సమావేశంలో త్వరలోనే వుంటుందని అక్కడి ఫెడరల్ శాఖ ఆర్థిక విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఈ భేటీలో నల్లధన కుబేరులు వివరాలను భారత ప్రభుత్వానికి అందిస్తారా..? వారి డబ్బు వివరాలను కూడా అందిస్తారా..? లేదా అన్న విషయాలను మాత్రం తెలియజేయలేదు.

కాగా స్విజ్జర్ ల్యాండ్ ప్రభుత్వానికి వున్న న్యాయపరమైన అంశాలతో పాటు డబ్బును తీసుకురావడంలో.. వున్న ఇబ్బందులపై ఇరు దేశాల ఉన్నతాధికారులు సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Black money  Switzerland  India  Swiss banks  Swiss black money  

Other Articles