Yahoo to lay off jobs at bangalore office

yahoo, lay off jobs, bangalore office, pink slips, rennovate

yahoo to lay off jobs at bangalore office

యాహూలో పింక్ స్లిప్ ల అలజడి.. ఉద్యోగులు అందోళన

Posted: 10/08/2014 01:21 PM IST
Yahoo to lay off jobs at bangalore office

ప్రముఖ సెర్చింజన్, మెయిల్ ప్రొవైడర్ సంస్థ యాహూలో పింక్ స్లిప్ ల అలజడి మరోమారు తెరమీదకు రానుంది. భారతదేశంలో యాహూ మరోమారు భారీగా ఉద్యోగాలకు కోత పెడుతున్నట్లు తెలిసింది. బెంగళూరు కార్యాలయాన్ని తాము పునర్నిర్మిస్తున్నట్లు చెబుతున్నా, ఎక్కడా ఉద్యోగాల కోత విషయాన్ని మాత్రం సంస్థ యాజమాన్యం అధికారికంగా నిర్ధారించడం లేదు. కాగా, గతంలో కూడా ఒకసారి ఇలాగే 2000 మంది ఉద్యోగులను సంస్థ యాజమాన్యం తొలగించడంతో.. ఈ దఫా కూడా మళ్లీ అలాంటి చర్యలే చేపట్టనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అప్పట్లో 200 మంది ఉద్యోగులను తొలగించి సుమారుగా 375 మిలియన్ డాలర్ల సొమ్మును ఆదా చేసుకున్న.. యాహూ మరమారు పొదుపు మంత్రం జపిస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కాగా, యాహూ నిరంతర ప్రగతి సాధిస్తూనే ఉందని, మరింత సామర్థ్యాన్ని సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్, లీడ్ ప్రచి సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు కార్యాలయాన్ని తాము పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తున్నామని అమె ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశంలోను.. బెంగళూరులో కూడా తాము తమ ఉనికిని బాగానే చాటుకుంటామని అన్నారు. అయితే అనధికారిక కథనాల ప్రకారం ఈసారి కూడా దాదాపు రెండు వేల మందికి యాహూ పింక్ స్లిప్పులు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. యాజమాన్యం పొదుపు మంత్రం జపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పడు, ఏం జరుగుతుందా..? అన్న ఉత్కంఠ యాహూ ఉధ్యోగులలో నెలకొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yahoo  lay off jobs  bangalore office  pink slips  rennovate  

Other Articles