Mukesh ambani 18th richest man in world

Warren Buffett,Reliance Industries,Mukesh Ambani,Ingvar Kamprad,Bloomberg,Bill Gates,Amancio Ortega

Indian business magnate Mukesh Ambani is the 18th richest person in the world with a personal wealth of $24.7 billion in 2012, according to the Bloomberg Billionaires Index, a daily ranking of the world's 100 wealthiest individuals

Mukesh Ambani 18th richest man in world.png

Posted: 01/04/2013 06:55 PM IST
Mukesh ambani 18th richest man in world

Mukesh_Ambaniభారత కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 18వ స్థానం దక్కించుకున్నారు. 2012లో ఆయన వ్యక్తిగత సంపద సుమారు 2,470 కోట్ల డాలర్లుగా లెక్కతేలింది. ప్రపంచంలో 100 మంది అత్యంత సంపన్నుల జాబితాను రోజువారీ రూపొందించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఏడాది ప్రపంచ కుబేరుల్లో చోటు దక్కించుకున్నారు. సంపద 2,100 కోట్ల డాలర్ల నుంచి 2,470 కోట్ల డాలర్లకు పెరగడంతో ముకేశ్ 19వ స్థానం నుంచి 18వ స్థానానికి చే రారు.ప్రపంచంలో టాప్ 100 బిలియనీర్ల సంపద 2012లో దాదాపు 15 శాతం పెరిగి 1.81 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ జాబితాలో మెక్సికన్ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం టెల్మెక్స్ చైర్మన్ కార్లోస్ స్లిమ్ 7,640 కోట్ల డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫ్యాషన్ రిటైలింగ్ సంస్థ జారా వ్యవస్థాపకుడు ఆమాన్చియో ఓర్టెగా వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ నాలుగో స్థానంలోనూ, ఐకియా వ్యవస్థాపకుడు ఇంగ్వర్ కాంప్రాద్ అయిదో స్థానంలో నిల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sensex hits 20000 in trade
New year may bring in up to 10 lakh jobs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles