New banks may aid your savings

Sachin Kumar, savings, banks, savings deposits, banking reform bill

Your savings deposits may now fetch you more interest earnings, following the expected entry of new private banks after the passage of a banking reform bill this week

New banks may aid your savings.png

Posted: 12/20/2012 06:23 PM IST
New banks may aid your savings

New_banks_may_aid_your_savingsబ్యాంకింగ్ రంగంలో ఇక ‘కొత్త’ సమీకరణాలకు తెరలేవనుంది. కీలకమైన బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు-2011ను అనేక అవాంతరాలను అధిగమించి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆమోదింపజేయడంతో... ఇక కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల జారీకి కూడా అడ్డంకులూ తొలగినట్లయింది. దీంతో లెసైన్స్‌ల కోసం కార్పొరేట్ కంపెనీలు తమ కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. బిల్లు పాస్ కావడంతో ప్రధానంగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్(అడాగ్), రెలిగేర్ గ్రూప్‌లు ఇప్పటికే తమ ప్రయత్నాలకు పదునుపెట్టినట్లు సమాచారం. ఈ బిల్లు ఆమోదంతో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం, ఇతరత్రా పలు కీలక మార్పులు సాకారం కానున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కొత్త ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ఇక పూర్తిగా ద్వారాలు తెరచుకున్నట్టే.

కొత్తగా బ్యాంకింగ్ లెసైన్స్ జారీకోసం మార్గదర్శకాలు ఖరారు చేయడంతోపాటు దరఖాస్తుల స్వీకరణ ఇతరత్రా ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఆర్థిక మంత్రి చిదంబరం... ఆర్‌బీఐకి ఇప్పటికే సూచించడం తెలిసిందే. అయితే, ముందుగా బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు ఆమోదముద్ర పడితేనే ఈ దిశగా తాము చర్యలకు శ్రీకారం చుడతామని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పడం కూడా జరిగింది. మొత్తంమీద బిల్లుకు మోక్షం లభించడంతో ఇప్పుడు అందరికళ్లూ ఆర్‌బీఐపైనే ఉన్నాయి. కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లకు 2011 ఆగస్టులో ముసాయిదా నిబంధనలను జారీ చేసిన ఆర్‌బీఐ దీనిపై వివిధ పక్షాల నుంచి అభిప్రాయాల సేకరణను కూడా పూర్తి చేసింది. ఈ ఏడాది జూలైలో ఈ సూచనలు, అభిప్రాయాలను విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vizag signs mou with indian railways
Tata sons appoints cyrus p mistry as chairman from dec 28  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles