Tata sons appoints cyrus p mistry as chairman from dec 28

Tata Steel,Tata Sons,Tata Motors,Tata Global Beverages,Tata Consultancy Services,Tata Chemicals,ratan tata,Indian Hotels Company,Cyrus P Mistry

Appointment of Cyrus P Mistry as its chairman from December 28

Tata Sons appoints Cyrus P Mistry.png

Posted: 12/19/2012 06:48 PM IST
Tata sons appoints cyrus p mistry as chairman from dec 28

Ratan_tataదాదాపు నూట యాభై ఏళ్ల చరిత్ర గల టాటా సన్స్ పగ్గాలు కొత్త తరం చేతికి వచ్చాయి. రతన్ టాటా వారసుడిగా సైరస్ మిస్త్రీ చైర్మన్‌గా మంగళవారం లాంఛనంగా నియమితులైనట్లు టాటా సన్స్ వెల్లడించింది. ఈ నెల 28న టాటా పదవీ విరమణ చేసిన తర్వాత మిస్త్రీ అధికారికంగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడతారు. ఇకపై రతన్ టాటా చైర్మన్ ఎమెరిటస్‌గా(గౌరవ చైర్మన్) కొనసాగుతారని సంస్థ వివరించింది. టాటా సామ్రాజ్య బాధ్యతలను చేపట్టే సమర్థుడి కోసం సుదీర్ఘంగా సాగిన అన్వేషణ అనంతరం గతేడాది నవంబర్‌లో మిస్త్రీ (44) రతన్ టాటా వారసుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయన టాటా సన్స్ డిప్యూటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. నిర్మాణ రంగ దిగ్గజం షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కుమారుడు సైరస్ మిస్త్రీ. టాటా సన్స్‌లో అతి పెద్ద వాటా(18%) ఆయన కుటుంబానిదే. 2006 నుంచి టాటా సన్స్ బోర్డులో ఆయన ఉన్నారు.

కొన్నాళ్లుగా టాటా గ్రూప్ వ్యాపార మెళకువలను రతన్ నుంచి సైరస్ నేర్చుకుంటున్నారు. బాధ్యతలను బదలాయించే ప్రక్రియలో భాగంగా రతన్ టాటా క్రమంగా ఒక్కో గ్రూప్ సంస్థ చైర్మన్ హోదా నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. గత నెలలోనే టాటా గ్లోబల్ బెవరేజెస్ చైర్మన్‌గా వైదొలిగారు. డిసెంబర్ 28న రతన్ రిటైర్ అయిన తర్వాత నుంచి ఆయన చైర్మన్‌గా ఉంటారని టాటా మోటార్స్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. కన్సల్టెన్సీ దిగ్గజం టీసీఎస్‌లో ఇప్పటికే ఆయన డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New banks may aid your savings
Rbi disappointment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles