Housing prices up in 9 cities down in 11 places nhb

housing prices, kolkata, mumbai, chennai, property, housing, real estate prices

Showing a mixed trend, housing prices in 11 cities, including Bangalore and Kolkata, declined by up to 5 per cent in July-September, while rates in nine other places increased by up to 10 per cent, according to National Housing Bank.

Housing prices  down NHB.png

Posted: 11/24/2012 02:05 PM IST
Housing prices up in 9 cities down in 11 places nhb

Housing_pricesదేశ వ్యాప్తంగా ఇళ్ల ధరలు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్, విజయవాడ నగరా లు క్షీణత నమోదైన 11 నగరాల జాబితాలో ఉన్నాయి. మరో 9 నగరాలలో ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే, రెండో త్రైమాసికంలో ఇళ్ల ధరలు కోచిలో గరిష్ఠ స్థాయిలో 10.1 శాతం పెరగ్గా, సూరత్‌లో గరిష్ఠంగా 4.8 శాతం తగ్గాయి. 'నేషనల్ హౌసింగ్ బ్యాంక్' (ఎన్‌హెచ్‌బి) నివేదిక ప్రకారం, కొచ్చి తర్వాత 9 శాతంతో జైపూర్, 3.8 శాతంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్, 3 శాతంతో అహ్మదాబాద్, 2.3 శాతంతో భువనేశ్వర్, 2.2 శాతంతో లక్నో, ఒక్క శాతంతో చెన్నై, 0.7 శాతంతో పుణె, 0.5 శాతంతో ముంబై నగరాలు ధరలు పెరిగిన జాబితాలో ఉన్నాయి.సూరత్ తర్వాత 3.54 శాతంతో ఇండోర్, 2.4 శాతంతో విజయవాడ, కోల్‌కతా, 1.8 శాతంతో పాట్నా, 1.7 శాతంతో బెంగళూరు, లూథియానా, 1.3 శాతంతో హైదరాబాద్, 0.7 శాతంతో గౌహ తి, 0.5 శాతంతో భోపాల్, 0.4 శాతంతో ఫరీ దాబాద్ ధరలు తగ్గిన నగరాల జాబితాలో ఉన్నాయి. ముడి సరుకు వ్యయాలను, ద్రవ్యోల్బణ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, ధరలు పెరిగిన 9 నగరాలలో కూడా నికర క్షీణత ఉందని ఎన్‌హెచ్‌బి చైర్మన్, ఎండి ఆర్‌వి వర్మ పేర్కొన్నారు. ఇళ్ళ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఇళ్లకు డిమాండ్ తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తం గా 20 నగరాలలో అధ్యయనం చేసిన ఎన్‌హెచ్‌బి, వచ్చే జనవరి నుంచి మరో 6 నగరాలలో అదనంగా అధ్యయనం చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gold rate touched an intraday high
No takers for mukesh rgtil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles