Gold rate touched an intraday high

gold,gold price,gold rate,gold price in India.

The GOLD rate touched an intraday high of Rs 33193.00 and an intraday low of Rs 33139.00..

GOLD rate touched an intraday high.png

Posted: 11/27/2012 06:49 PM IST
Gold rate touched an intraday high

gold_rate_highపెళ్లిల సీసన్, బంగారం పై మధ్యతరగతి వారి దగ్గర నుండి కోటీశ్వరులకు రోజు రోజు కీ పెరుగుతున్న మోజు, రూపాయి విలువ శరవేగంగా తగ్గిపోవడం, ఇలా కారణం ఏదైనా, బంగారం ధర ఆకాశాన్ని అంటి ఇంకా పైపైకి దూసుకుపోతోంది. సోమవారం వరకు స్టాక్ మార్కెట్ల లావాదేవీలు పరిశీలనలోకి తీసుకుంటే, 10 గ్రాముల బంగారం ధర, అక్షరాల 32, 950/- కి చేరుకుంది. ఇక ఇవాల్టి మార్కెట్ లావాదేవీల అనుసారం 10 గ్రాముల పసిడి 32, 800/- దగ్గర నాట్యం చేస్తోంది... వెండి కూడా, కిలో 63, 000/- కు చేరి, బంగారానికి ఏ మాత్రం తీసిపోదని నిరూపించింది.

గతం లో సెప్టెంబర్ లో కూడా, బంగారం ధర, అమాంతం 32, 900/- కు పెరిగి రికార్డ్ సృష్టించింది... ఇక ఇప్పుడు, ఈ పెరుగుదల, మరింత తారష్టాయికి చేరుకునే విధం గా ఉంది... సామాన్యుడు బంగారం కొనాలి అంటే ఇక కల్లె. అయితే బంగారం అమ్మాలి అని అనుకునే వారికి మాత్రం ఇంతకూ మించిన మంచి అవకాసం ఇంకొకటి లేదు. పిసరంత బంగారం అమ్మినా, లాభాలే మిగులుతాయి. మార్కెట్ లో రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడం, ఇతర ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం ధర ఇలా పెరగడానికి కారణం అని కొందరు అంటే, కొనే వాళ్ళు ఉంటె దహర పెరగడా మరి? అని ఇంకొందరు యెదూ ప్రసన వేస్తున్నారు... అయితే, ఎప్పుడోబంగారం అధిక మోతాదులో కొనిపెట్టుకున్న బంగారం షాపుల ఒనేర్లకు మాత్రం, ఈ పెరుగుదల కాసుల పంటలనే తెచ్చిపెడుతోందని చెప్పాలి.

దీనికి తోడూ, కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రవేశ పెడుతున్న దిస్కావుంట్లు, ఇంస్తాల్మేంట్ల స్కీములు కూడా, షాపు ఒనేర్లకు అత్యంత ఎక్కువ మోతాదులో లాభాలను ఆర్జించి పెడుతోంది. ఇక రానున్నది, పెళ్ళిళ్ళ సీసన్. యెంత లేదు అన్నా, కనీసం బంగారం కొనక తప్పదు... ఇలా బలవంతంగా అయినా కస్టమర్ల రాకపోకలతో, ధరలు ఎంతపెరిగిన బంగారం - వెండి షాపులు కళకళలాడుతున్నాయి. అయితే, ఈ పెరుగుదల అంతా కొద్ది రోజుల మురిపెమే అని, ఆకాశాన్ని అంటిన బంగారం ధర దిగిరావాల్సిందే అని చెప్పే విశ్లేషకులూ లేకపోలేదు. ఏది ఏమైనా, మీ చుట్టాల మేడలో చూసిన ఆ అందాల హారం వెంటనే మీకు  కావాలంటే మాత్రం, మీ ఆర్ధిక పరిస్థితి ఎగువ మధ్యతరగతికన్నా ఎక్కువ ఉండాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sensex crosses 19000 mark
Housing prices up in 9 cities down in 11 places nhb  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh