Direct flights from visakhapatnam

Direct Flights From Visakhapatnam To ... - Direct Flights India

Direct Flights From Visakhapatnam To ... - Direct Flights India

Visakhapatnam.gif

Posted: 09/03/2012 04:30 PM IST
Direct flights from visakhapatnam

Direct Flights From Visakhapatnam To ... - Direct Flights India

 విదేశీ విమానాల రాకపోకలకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది. నగరానికి అంతర్జాతీయ విమాన సేవలకు ప్రతిబంధకంగా మారిన రాత్రిపూట ల్యాండింగ్‌కు నావికాదళం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మార్గం సుగమమైంది. ఈమేరకు వారానికి మూడు రోజుల పాటు బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రిపూట 11 గంటల వరకూ ఎయిర్‌పోర్టును విమాన రాకపోకలకు వినియోగించేందుకు అనుమతించింది. విశాఖకు రాత్రి వేళలలో సర్వీసులను నడిపేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఇప్పటికే అంగీకరించగా... తాజాగా శ్రీలంక ఎయిర్‌లైన్స్ కూడా ఆసక్తి కనబరుస్తోంది. తమ సర్వీసులను వచ్చే నెలలో ప్రారంభిస్తామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ కళ రానుంది. ప్రస్తుతం వివిధ విమానయాన సంస్థలు విశాఖకు రోజూ 32 విమానాలను నడుపుతున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్‌కు పర్యాటకులు, వాణిజ్యవేత్తల తాకిడి బాగా పెరిగింది.

గత మార్చిలో ఎయిర్ ఇండియా ఇక్కడి నుంచి దుబాయ్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రవేశపెట్టింది. విశాఖ విమానాశ్రయం నేవీ పర్యవేక్షణలో ఉండడంతో రాత్రి పూట విమానాలు తిరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ సాంకేతిక కారణాలతో అంగీకరించలేదు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వారానికి మూడు రోజులు రాత్రి పూట వినియోగించుకునేందుకు సడలింపునిచ్చింది. దుబాయ్, సింగపూర్‌లకు విశాఖ నుంచి నేరుగా విమానాలు రాకపోకలు సాగిస్తున్న తరుణంలో శ్రీలంక కూడా ఓ సర్వీసును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేసింది. గతంలో హైదరాబాద్ నుంచి శ్రీలంకకు విమానం నడిపిన శ్రీలంక విమానయాన సంస్థ... ఎయిర్ ట్రాఫిక్ లేకపోవడంతో విమానాన్ని రద్దు చేసింది. విశాఖ పరిధిలో 33 బౌద్ధారామాలుండడం, అచ్యుతాపురంలోని ప్రముఖ వ్యాపార సంస్థ బ్రాండిక్స్‌కు తమ దేశ ప్రతినిధులు వారంలో మూడుసార్లు చాప్టర్‌లో రావటంతో శ్రీలంక ఎయిర్‌లైన్స్ కూడా నగరానికి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మరో వారం రోజుల్లో శ్రీలంక నుంచి ప్రతినిధుల బృందం విశాఖకు రానున్నట్లు పౌరవిమానయానశాఖ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sbi chairman and deputy governor of rbi be locked up in a room
Sbi branches may stay open on sundays  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles