Sbi chairman and deputy governor of rbi be locked up in a room

economy (general),RBI and other central banks,economy, business and finance,banking,Subbarao, Pratip Chaudhuri, SBI chief, KC Chakrabarty, RBI, cash reserve ratio, CRR issue, CRR row

he members of the committee, Subbarao said, would be Pratip Chaudhuri, Chairman, State Bank of India, and K.C. Chakrabarty, Deputy Governor, RBI. Both, with opposite views on CRR (the percentage of deposits that banks need to keep with RBI), have sparred over the issue

SBI Chairman and Deputy Governor of RBI be locked up in a room.png

Posted: 09/05/2012 06:19 PM IST
Sbi chairman and deputy governor of rbi be locked up in a room

Subbaraoనగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) తగ్గించే అంశంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్ ప్రతీప్ చౌదరి, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి మధ్య రేగిన వివాదం చల్లారడం లేదు. దీంతో, ఈ వివాదం తీవ్రతను తగ్గించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రంగంలోకి దిగారు. మంగళవారం జరిగిన ఫిక్కీ-ఐబీఏ సదస్సు దీనికి వేదికైంది. గత నెల 23న వివాదం మొదలైన తర్వాత తొలిసారిగా స్పందించిన దువ్వూరి.. దీని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.సీఆర్‌ఆర్‌పై చక్రవర్తి, చౌదరిలతో కమిటీ వేసి, వారిద్దరినీ ఒక గదిలో పెట్టాలని, తన పదవీకాలం పూర్తయ్యే దాకా వారు నివేదిక ఇవ్వకుండా చూసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన చమత్కరించారు.

‘నేనొక ముఖ్యమైన ప్రకటన చేయాలి. గత రాత్రే దీనిపై ఒక కమిటీని నియమించాను. అసలు సీఆర్‌ఆర్‌ను కొనసాగించాలా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇందులో.. కేసీ చక్రవర్తి, ప్రతీప్ చౌదరి సభ్యులుగా ఉంటారు. కమిటీ నిబంధనలేమిటంటే.. ఈ ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేదాకా వారిని ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు. నా పదవీ కాలం పూర్తయ్యేదాకా వారు నివేదిక ఇవ్వరాదన్నది ముఖ్యమైన షరతు’ అంటూ సుబ్బారావు సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, నిజమేచెబుతున్నారా లేదా జోక్ చేస్తున్నారా అంటూ ఆడియన్స్ అడగ్గా ‘మీరేమనుకుంటున్నారు?’ అని ఆయన ఎదురుప్రశ్న వేశారు. మరోవైపు.. చక్రవర్తి, చౌదరి మాత్రం వెనక్కి తగ్గలేదు. సదస్సు నుంచి సుబ్బారావు వెళ్లిపోయిన తర్వాత ఇద్దరూ మళ్లీ తమ వాగ్వాదాన్ని కొనసాగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gold price continue to rise in futures trade
Direct flights from visakhapatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles