Deccan chronicle shares

Deccan Chronicle shares.png

Posted: 08/11/2012 04:42 PM IST
Deccan chronicle shares

క్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రమోటర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర తాకట్టుపెట్టిన షేర్ల మొత్తం వారి అసలు వాటాను మించిపోయింది. స్వయంగా రెగ్యులేటరీ సంస్థలకు, స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ముగ్గురు ప్రమోటర్లు టి వెంకట్రామ్‌రెడ్డి, టి వినాయక్ రవిరెడ్డి, పికె అయ్యర్‌కు ఒక్కొక్కరికి కంపెనీలో 24.61 శాతం చొప్పున మొత్తం 73.83 శాతం వాటా ఉంది. కేవలం మూడు రోజుల వ్యవధిలో బ్యాంకులు ఆర్థిక సంస్థల దగ్గర వీరు తాకట్టు పెట్టిన షేర్ల మొత్తం మాత్రం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ఈక్విటీలో 82.71 శాతానికి చేరింది.

వివరాలు వెల్లడించని లావాదేవీలు, బయటకు రానిలెక్కలను కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రమోటర్లు తాకట్టు పెట్టిన షేర్లు వారి అసలు వాటాకంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంటే ఒక్క షేరును రెండు, మూడు సంస్థల దగ్గర తాకట్టుపెట్టారన్న మాట. ఈ భారీ కుంభకోణం మార్కెట్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తప్పుడు సమాచారం, దొంగలెక్కలతో కంపెనీ ప్రమోటర్లు షేర్ల తాకట్టులో భారీ మోళీకి పాల్పడటమే కాకుండా కంపెనీకి సంబంధించిన సమస్త స్థిర, చరాస్తులను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలను సమీకరించిన వైనంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New research prints blood vessels from inkjet printer
Criticism forces upa to drop cell phone scheme  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles