Criticism forces upa to drop cell phone scheme

Criticism forces UPA to drop cell phone scheme,upa cannot promise food for poor, but moots phone in every hand, soaps for poor, bpl families, 2014 lok sabha elections

Criticism forces UPA to drop cell phone scheme

UPA.gif

Posted: 08/09/2012 03:02 PM IST
Criticism forces upa to drop cell phone scheme

Criticism forces UPA to drop cell phone scheme

యూపీఏ ప్రభుత్వం మరో భారీ ప్రజాకర్షక పథకాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పేదరిక రేఖ(బీపీఎల్)కు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా మొబైల్ ఫోన్లు, నెలకు 200 నిమిషాల టాక్‌టైం ఇస్తే ఎలా ఉంటుందా అని యోచిస్తోంది! ఈ పథకం సాధ్యాసాధ్యాలపై ప్రణాళికా సంఘం ఇప్పటికే అధ్యయనం కూడా ప్రారంభించింది. వచ్చేవారం ప్రధాని మన్మోహన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించే అవకాశముంది. ‘గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు గాను బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా మొబైల్ ఫోన్లు అందించాలని అనుకుంటున్నాం. ఈ పథకం ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందన్న దానిపై టెలీకమ్యూనికేషన్స్ విభాగంతో చర్చిస్తున్నాం’ అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాం టెక్ సింగ్ అహ్లూవాలియా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఒకవేళ ఇది అమల్లోకి వ స్తే... రైతుల రుణ మాఫీ పథకం తర్వాత యూపీఏ సర్కారు తెచ్చిన మరో భారీ ప్రజాకర్షక పథకం అవుతుంది. దేశంలో 6.52 కోట్ల బీపీఎల్ కుటుంబాలున్నాయి. వీరికి ఉచితంగా మొబైల్ ఫోన్లు, టాక్‌టైం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏటా రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ ఖర్చవుతుంది.

   Criticism forces UPA to drop cell phone scheme

ఎన్నికల గిమ్మిక్కు... బీజేపీ: బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు పంపిణీ చేయాలన్న సర్కారు ఆలోచనను ఎన్నికల గిమ్మిక్కుగా బీజేపీ కొట్టి పారేసింది. పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యమని, వారికి మొబైల్ ఫోన్లు ఇవ్వడం కాదని హితవు చెప్పింది. అసలు సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి చౌకబారు ఎన్నికల గిమ్మిక్కులకు పాల్పడుతోందని బీజేపీ నేత బల్బీర్ పుంజ్ విమర్శించారు. ధరల మోతతో సామాన్యుడి నడ్డి విరిచిన ప్రభుత్వం, ఇలాంటి ప్రకటనల ద్వారా వారికి పుండు మీద కారం చల్లుతోందని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తొలుత పేదలకు రెండు పూటలా భోజనం పెట్టాలని, కనీసం మొబైల్ ఫోన్ల పట్టుకునే బలం వారికి కలిగించాలని బీజేపీ మరో అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. నిరుపేదలకు మొదల కూడు, గూడు కావాలని, ఖాళీ కడుపులతో మొబైల్ ఫోన్లను వారేం చేసుకుంటారని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deccan chronicle shares
India ranks no2 in google search queries for education  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles