Monsoon session begins chidambaram now finance minister in oppositions crosshairs

Monsoon session begins: Chidambaram, now Finance Minister, in Opposition's crosshairs

Monsoon session begins: Chidambaram, now Finance Minister, in Opposition's crosshairs

Finance.gif

Posted: 08/08/2012 11:27 AM IST
Monsoon session begins chidambaram now finance minister in oppositions crosshairs

Monsoon session begins: Chidambaram, now Finance Minister, in Opposition's crosshairs

కొత్త ఆర్థిక మంత్రిగా చిదంబరం పగ్గాలు చేపట్టారన్న ఉత్సాహంలో గత రెండు సెషన్లుగా స్టాక్‌మార్కెట్లు పరుగులు తీస్తున్నప్పటికీ 2012-13 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు, స్థూల ఆర్థిక స్థితి, ఇతరత్రా అంశాలపై వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో అత్యధికంగా నిరాశే వ్యక్తం అయింది. ప్రధానంగా దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఆవరిస్తున్న దుర్భిక్షం మేఘాలు, అంతర్జాతీయంగా ఇప్పటికీ కుదుటపడని ఆర్థిక రంగం భారత వృద్ధి అవకాశాలను దెబ్బ తీయనున్నాయని ఆ సర్వేలు తేల్చాయి. ఇన్ని ప్రతికూల వార్తల నడుమ జూలైలో వినియోగదారుల విశ్వాసం పెరిగిందన్నది ఒక్కటే చీకట్లో చిరుదివ్వెగా చెప్పదగిన అంశం. వృద్ధిరేటు 5.5 శాతం దాటదు.. భారత్ వృద్ధిరేటు వర్తమాన ఆర్థిక సంవత్సరంలో (2012-13) 5.5 శాతం మించే అవకాశం లేదని క్రిసిల్ తేల్చి చెప్పింది. వృద్ధిరేటు 6.5 శాతం ఉండవచ్చునంటూ తాను జూన్‌లో ప్రకటించిన అంచనాను కుదించింది. దేశీయంగా నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులతో పాటు అంతర్జాతీయంగా కూడా ఆర్థిక వాతావరణం మరింత సంక్షుభితం కావడంతో భారత వృద్ధి రేటు ప్రభావితం అయ్యే ఆస్కారం ఉన్నదని క్రిసిల్ 'భారత స్థూల ఆర్థిక స్థితి : అంచనాల సమీక్ష' పేరిట విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది. ఈ ఏడాది టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాను కూడా గతం లో ప్రకటించిన ఏడు శాతం నుంచి ఎనిమిది శాతానికి పెంచింది. ఆర్‌బిఐ జూలై 31న ప్రకటించిన పరపతి విధానం త్రైమాసిక సమీక్షలో వృద్ధి రేటును 6.5 శాతానికి కుదించి ద్రవ్యోల్బణం అంచనాను 8 శాతానికి పెంచింది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా విత్తలోటు బడ్జెట్‌లో ప్రకటించిన లక్ష్యం 5.8 శాతానికి పరిమితం కాకపోగా 6.2 శాతానికి పెరగవచ్చునని పేర్కొంది. ఇంధనం ధరల సబ్సిడీ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో విత్తలోటు 5.76 శాతానికి పెరిగింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ నెలల మధ్య కాలంలో 1.9 లక్షల కోట్ల రూపాయలుంది. ఈ ఏడాది విత్తలోటును 5.1 శాతానికి కుదించాలన్నది లక్ష్యం అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో అది ఏ మాత్రం సాధ్యం కాదని కూడా పరిశీలకులంటున్నారు. దేశీయంగా నెలకొన్న పరిస్థితులతో పాటు యూరోజోన్ సంక్షోభం కారణంగా విదేశీ పెట్టుబడుల రాక కూడా తగ్గి ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని క్రిసిల్ అంచనా వేసింది. మైనింగ్, భూసేకరణ అంశాల్లో విధానపరమైన అవరోధాలు తొలగించి ప్రాజెక్టుల సత్వర అనుమతులకు రంగం సిద్ధం చేసినట్టయితే పరిస్థితి కొంత మెరుగుపడవచ్చునని క్రిసిల్ పేర్కొంది.

మూడో త్రైమాసికం కూడా నీరసమే.. మూడో త్రైమాసికంలో స్థూల ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పు ఉండబోదని కార్పొరేట్ కంపెనీల ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. భారత కార్పొరేట్ల సిఎఫ్ఒలతో డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది మూడో త్రైమాసికంలో పరిస్థితులు పూర్తి నిరాశాజనకంగానే ఉంటాయన్న అభిప్రాయం ప్రకటించారు. రెండో త్రైమాసికంలో ఈ అభిప్రాయం ప్రకటించిన వారి సంఖ్య 49 శాతమే ఉంది. వ్యాపార సెంటిమెంట్ క్షీణించిందనడానికి ఇది తార్కాణమని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ సిఒఒ మోహన్ రంగస్వామి అన్నారు. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ చేపడతామన్న సిఎఫ్ఒల సంఖ్య 72 శాతం, కార్పొరేట్లకు ఆర్థికపరమైన రిస్క్ తగ్గలేదన్న వారి సంఖ్య 75 శాతం ఉంది. కార్పొరేట్లకు ఆర్థిక రిస్క్ మరింతగా పెరుగుతుందన్న అభిప్రాయం స్వల్పకాలం నుండి మధ్యకాలిక రికవరీపై నెలకొన్న సందిగ్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము రిస్క్ మేనేజ్‌మెంట్ సాధనాలు ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదన్న సిఎఫ్ఒల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది.

తగ్గిన భారత ఎఫ్‌డిఐలు.. భారత కార్పొరేట్ సంస్థలు విదేశాల్లో పెట్టిన ప్రత్యక్ష పెట్టుబడులు జూలై మాసంలో గణనీయంగా తగ్గాయి. జూన్‌లో ఈ పెట్టుబడులు 353 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండగా జూలైలో అవి 124 కోట్ల డాలర్లకు పడిపోయాయని ఆర్‌బిఐ గణాంకాలు తెలుపుతున్నాయి. జూలై చివరి నాటికి భారత కార్పొరేట్ల విదేశీ పెట్టుబడుల మొత్తం పరిమాణం 43,614 కోట్ల డాలర్లకు చేరింది. దీనిపై తాను పెద్దగా వ్యాఖ్యానించదలుచుకోవడంలేదని, దేశీయంగా పరిస్థితులు మెరుగు పడినందు వల్ల ఇన్వెస్టర్ల వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని భారత విదేశీ వాణిజ్య సంస్థ (ఐఐఎఫ్‌టి) డైరెక్టర్ కెటి చాకో అన్నారు.  జూలైలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో జెఎస్‌డబ్ల్యు స్టీల్, భారతి ఎయిర్‌టెల్, టాటా స్టీల్, గ్లోబల్ గ్రీన్, రెలిగేర్ కాపిటల్ మార్కెట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్పైస్ ఇన్వెస్ట్ అండ్ ఫైనాన్స్ అడ్వైజర్స్ ఉన్నాయి. మారిషస్, నెదర్లాండ్స్, అమెరికాల్లోని పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థల ద్వారా జెఎస్‌డబ్ల్యు స్టీల్ 16.34 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. భారతి ఎయిర్‌టెల్ మారిషస్‌లోని అనుబంధ సంస్థ ద్వారా కమ్యూనికేషన్, స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాల్లో 15 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. యుఏఇ, ఆస్ట్రేలియాల్లోని పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సర్వీసులు, బీమా, రియల్ ఎస్టేట్, బిజినెస్ సర్వీసుల విభాగాల్లో 4.56 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Loans to assist people with bad credit scores
Power crisis hits small industries  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles