Power crisis hits small industries

Power crisis hits small industries

Power crisis hits small industries

industries.gif

Posted: 08/08/2012 11:23 AM IST
Power crisis hits small industries

Power crisis hits small industries

 ఈ నెల 20వ తేదీలోపు చిన్న పరిశ్రమలకు కరెంటు కష్టాలతోపాటు.. ఇతర డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా చిన్నతరహా పరిశ్రమలు మూసివేస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఎపి స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫ్యాప్సియా) రాష్ట్ర అధ్యక్షుడు ఎపికె రెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ఎపి రీసైకిల్ పేపర్‌మిల్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 90 శాతం ఉద్యోగాలలో 80 శాతం రెవెన్యూను చిన్నతరహా పరిశ్రమలే ప్రభుత్వానికి అందిస్తున్నాయన్నారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో ఇప్పటికే చిన్న తరహా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చిన్నతరహా పరిశ్రమ యజమానులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌రంగ యాజమాన్యాలకు పవర్ పాలసీ లేదని, రాష్ట్రానికి విద్యుత్ విధానం ఎంతో అవసరమని గుర్తుచేశారు. రాబోయే కాలంలో ఎన్ని పరిశ్రమలకు కరెంటు అందిస్తారో తేల్చిచెప్పాలని ఎపికె రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు చెబుతున్నట్లుగా విద్యుత్ కోతలకు సకల జనుల సమ్మె కారణం కాదన్నారు. విద్యుత్ రంగ యాజమాన్యాల వైఫల్యం కారణంగానే కరెంటు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నదన్నారు. ఇదే విధానం కొనసాగితే 2016 వరకు కరెంటు కష్టాలు తప్పవని రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. చిన్న తరహా పరిశ్రమల డిమాండ్లను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన తెలిపారు. వాటిని ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరించకపోతే హైదరాబాద్‌ని దిగ్భందిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత పరిశ్రమలు మూసివేసి సహాయ నిరాకరణ చేస్తామని రెడ్డి ప్రకటించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Monsoon session begins chidambaram now finance minister in oppositions crosshairs
Rbi launches website to explain detection of fake currency  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles