Kingfisher shares tank 13 as lessors take back 34 planes

Kingfisher shares tank 13% as lessors take back 34 planes,Kingfisher Airlines, Vijay Mallya, BSE, Sensex, NSE, lessors, lease rentals, aircraft

Kingfisher shares tank 13% as lessors take back 34 planes

Kingfisher.gif

Posted: 06/27/2012 04:36 PM IST
Kingfisher shares tank 13 as lessors take back 34 planes

Kingfisher shares tank 13% as lessors take back 34 planes

విలాసానికి మారుపేరైన విజయ్‌మాల్యా యాజమాన్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మరింత కష్టాల్లో పడింది. విమాన సర్వీసుల నిర్వహణ కోసం ఆ సంస్థ పలు విమానాలను అద్దెకు తీసుకుంది. వాటికి చెల్లించాల్సిన వెయ్యి కోట్ల రూపాయల అద్దె బకాయి పడింది. దీంతో విమానాలను లీజుకిచ్చిన సంస్థలు వాటిని వెనక్కి తీసుకున్నాయని చెబుతున్నారు. కాని తానే స్వచ్ఛందంగా విమానాలను వారికి అప్పగించినట్టు కింగ్‌ఫిషర్ చెబుతోంది. ఇది కాకుండా కింగ్‌ఫిషర్ సొంత విమానాల్లో 15 విడిభాగాలు లేక మూలన పడ్డాయి.

చివరికి ప్రస్తుతం 15 విమానాలు మాత్రమే నడుస్తున్నాయని అంటున్నారు. మార్చి, జూన్ నెలల మధ్య కాలంలో కింగ్‌ఫిషర్‌కు విమానాలను అద్దెకిచ్చిన కంపెనీలు 34 విమానాలను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం చేతిలో ఉన్న 15 విమానాలతో కింగ్‌ఫిషర్ సంస్థ కేవలం 100 డొమెస్టిక్ సర్వీసులు మాత్రం నడపగలుగుతోంది. అంతర్జాతీయ సర్వీసులను కింగ్‌ఫిషర్ ఎప్పుడో నిలిపివేసింది. కింగ్‌ఫిషర్ సంస్థ ప్రస్తుతం 7500 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 1151.5 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. చివరికి ఫిబ్రవరి నుండి సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించడంలేదు. ఆయిల్ కంపెనీలకు భారీ మొత్తంలో బకాయి పడింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్వీస్ టాక్స్, టిడిఎస్ కూడా చెల్లించడంలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taxsmile automated tax filing machines
Moodys says india rating stable despite challenges  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles